AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచు సరస్సుపై ఇరుక్కుపోయిన జింక.. ప్రాణాలను పణంగా పెట్టిన అగ్నిమాపక సిబ్బంది.. ఏం చేశారో చూడండి..

మంచు సరస్సు నుండి ఒక జింకను రక్షించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి కారణంగా, మిన్నెసోటా ప్రియర్ లేక్‌లో మంచు గడ్డకట్టింది. ఈ మంచులో ఒక జింక కూరుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు జింకను చేరుకోవడానికి మోకాళ్లపై పాకుతూ వెళ్లి మరీ జింకను చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

మంచు సరస్సుపై ఇరుక్కుపోయిన జింక.. ప్రాణాలను పణంగా పెట్టిన అగ్నిమాపక సిబ్బంది.. ఏం చేశారో చూడండి..
Firefighters Crawl
Jyothi Gadda
|

Updated on: Dec 02, 2023 | 8:48 PM

Share

అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింకను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు ఫైర్‌ సెఫ్టీ సిబ్బంది. నిజానికి ఆ మూగ జీవి మంచుతో నిండిన చెరువులో ఇరుక్కుపోయి కదలలేని స్థితిలో ఉండగా అగ్నిమాపక సిబ్బంది దాన్ని సురక్షితంగా బయటకు తీసిన తీరు చూడాల్సిందే.! జింకలను రక్షించే ఈ ఆపరేషన్ సోషల్ మీడియాలో ప్రజల హృదయాలను గెలుచుకుంది. అమెరికాలోని మిన్నెసోటాకు చెందినదిగా తెలిసింది. మంచు సరస్సు నుండి ఒక జింకను రక్షించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చలి కారణంగా, మిన్నెసోటా ప్రియర్ లేక్‌లో మంచు గడ్డకట్టింది. ఈ మంచులో ఒక జింక కూరుకుపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు జింకను చేరుకోవడానికి మోకాళ్లపై క్రాల్ చేసి దానిని రక్షించారు.

ఈ వీడియో నవంబర్ 27న Instagram హ్యాండిల్ @cityofpriorlake నుండి పోస్ట్ చేశారు. అతను క్యాప్షన్‌లో చెప్పాడు – ప్రజలు PLFD అని పిలిచారు. అతను సరస్సుపై సన్నని మంచు పొర మీద నుండి ఎంతో చాకచక్యంగా, ప్రాణాలకు తెగించి జింకను చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తమ రక్షణ సామగ్రిని ధరించి, జింకను చేరుకోవడానికి మంచును జాగ్రత్తగా క్రాల్ చేసి, జింకను ఒడ్డుకు తేవడంలో విజయం సాధించారు.!

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 31 వేలకు పైగా వీక్షణలు, 100 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది స్ఫూర్తికి పలువురు నెటిజన్లు సెల్యూట్ చేసి ప్రశంసలు కురిపించారు. లైకులు, షేర్ల చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..