Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mike Tyson: రూ.3 కోట్లు ఇస్తారా.. కేసు పెట్టమంటారా..? మైక్ టైసన్‌కు కొత్త తలనొప్పి

ఆ రోజు మైక్‌ టైసన్‌ తన సీట్లో కూర్చుని ఉండగా.. ఆయన వెనుక కూర్చున్న మెల్విన్‌ టౌన్‌సెండ్‌ అనే మరో ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆ వీడియోలో కన్పించింది. తన చేష్టలతో మెల్విన్‌ పలుమార్లు చిరాకు తెప్పించడంతో.. సహనం కోల్పోయిన టైసన్‌ తన సీట్లో నుంచి లేచి అతడిని చితకబాదాడు. దీంతో బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా ఆ వీడియోలో కన్పించింది.

Mike Tyson: రూ.3 కోట్లు ఇస్తారా.. కేసు పెట్టమంటారా..? మైక్ టైసన్‌కు కొత్త తలనొప్పి
Mike Tyson
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2023 | 7:54 PM

దిగ్గజ బాక్సర్, మాజీ ఛాంపియన్​ మైక్ టైసన్‌ ​న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ఆయన విమానంలో తోటి ప్రయాణికుడిపై పంచ్‌ల వర్షం కురిపించిన ఘటన గుర్తుందా.! నాడు టైసన్‌ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు ఇప్పుడు ఆయన నుంచి పరిహారం డిమాండ్‌ చేస్తున్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్సకు గానూ తనకు 3,50,000 పౌండ్లు భారత కరెన్సీలో దాదాపు రూ.3.6 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.  గతేడాది ఏప్రిల్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఆ రోజు మైక్‌ టైసన్‌ తన సీట్లో కూర్చుని ఉండగా.. ఆయన వెనుక కూర్చున్న మెల్విన్‌ టౌన్‌సెండ్‌ అనే మరో ప్రయాణికుడు బాగా ఇబ్బంది పెట్టినట్లు ఆ వీడియోలో కన్పించింది. తన చేష్టలతో మెల్విన్‌ పలుమార్లు చిరాకు తెప్పించడంతో.. సహనం కోల్పోయిన టైసన్‌ తన సీట్లో నుంచి లేచి అతడిని చితకబాదాడు. దీంతో బాధితుడి మొహం నుంచి రక్తం వచ్చినట్లు కూడా ఆ వీడియోలో కన్పించింది.

ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు ఇద్దర్నీ విచారించారు. దీనికి సంబంధించి బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో టైసన్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసు నమోదు చేయలేదు. అయితే, ఈ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత బాధితుడు మెల్విన్‌.. తాజాగా టైసన్‌ నుంచి పరిహారం డిమాండ్‌ చేయడం గమనార్హం. ఈ మేరకు మెల్విన్‌ తరఫు న్యాయవాదులు.. టైసన్‌కు ఓ లెటర్ పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

టైసన్‌ పంచ్‌లకు తాను తీవ్రంగా గాయపడ్డానని మెల్విన్‌ లెటర్‌లో ఆరోపించాడు. ఆ దాడి తర్వాత తనకు జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్రలేమి, వర్టిగో, మానసిక ఒత్తిడి, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. ఇందుకు తాను ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నానని తెలిపాడు. ఇన్స్యూరెన్స్‌ లేకపోవడంతో చికిత్స కోసం తాను చాలా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. ఆ దెబ్బలకు అయిన చికిత్స ఖర్చులకు గానూ టైసన్‌ తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఈ పరిహారం ఇవ్వకపోతే తాను కోర్టులో పరువునష్టం దావా వేస్తానని మెల్విన్‌ బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సెటిల్‌మెంట్‌ డిమాండ్‌ను టైసన్‌ తరఫు న్యాయవాదులు ఖండించినట్లు సమాచారం.