Viral Video: కోపంతో సఫారీ కారు వెంటపడ్డ ఏనుగు.. కారు డ్రైవర్‌ చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు

Elephant Chasing: సాధారణంగా ఏనుగులను సాధు జంతువులగానే పరిగణిస్తారు. అయితే వాటికి చిర్రెత్తుకొస్తే మాత్రం వాటిని ఎవ్వరూ ఆపలేరు. ఈనేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ ఒక ఏనుగు సఫారీ కారు వెంటపడింది. దీంతో కారులోని టూరిస్ట్‌లందరూ తెగ భయపడిపోయారు.

Viral Video: కోపంతో సఫారీ కారు వెంటపడ్డ ఏనుగు.. కారు డ్రైవర్‌ చేసిన పనికి  ఫిదా అవుతోన్న నెటిజన్లు
Elephant Chasing
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2022 | 5:24 PM

Elephant Chasing: సాధారణంగా ఏనుగులను సాధు జంతువులగానే పరిగణిస్తారు. అయితే వాటికి చిర్రెత్తుకొస్తే మాత్రం వాటిని ఎవ్వరూ ఆపలేరు. ఈనేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ ఒక ఏనుగు సఫారీ కారు వెంటపడింది. దీంతో కారులోని టూరిస్ట్‌లందరూ తెగ భయపడిపోయారు. అయితే ఇక్కడ డ్రైవర్‌ తన డ్రైవింగ్‌ స్కిల్స్‌తో వాహనాన్ని వేగంగా రివర్స్ చేయడంతో పర్యాటకులను ఏనుగు బారి నుంచి తప్పించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బ‌దోలా షేర్‌ చేసిన ఈ వీడియోలో.. ఓ సఫారీ కారును ఏనుగు వెంటాడుతుంది. అయితే కారు డ్రైవర్ మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడు.

ఏనుగు వేగంగా కారువైపు దూసుకొస్తున్నా ఏ మాత్రం భయపడకుండా పూర్తి కంట్రోల్‌తో కారును వేగంగా రివర్స్‌ చేశాడు. అలా చాలాసేపు రివర్స్‌ లోనే కారును నడుపుతాడు. చివరకు ఏనుగు విసిగిపోయి అడవిలోకి వెళ్లిపోతుంది. ఈనేపథ్యంలో ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్‌ డ్రైవింగ్‌ స్కిల్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఏనుగు ఎందుకు అంత అసహనంగా, ఆగ్రహంగా ఉందనేది అధికారులు విచారించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియో క్లిప్‌ను 1.2 లక్షల మంది వీక్షించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..