Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇది.. నేనెక్కడా చూడలే..
పాముల సయ్యాట గురించి మనకు తెలిసింది. రెండు పాములు ఒకదాని ఒకటి పెనవేసుకుని చాలాసేపు నాట్యంలో మునిగిపోతాయి. అయితే రెండు పాముల సయ్యాట మీరు చూసి ఉంటారు. ఇక్కడ 3 పాములు ఆ పనిలో నిమగ్నమవ్వడం విచిత్రంగా ఉంది. వీడియో వైరల్ అవుతోంది...

విషపూరిత పాము ఫోటో మన కళ్ళ ముందుకు వచ్చినా ఒక్కసారిగా భయం కలుగుతుంది. అయితే పాములు అంటే భయపడతారు కానీ పాముల వీడియోలు అయితే తెగ చూస్తారు జనాలు. నెట్టింట రోజూ స్నేక్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక పాముల పోరాటాలు, ఒక పాము మరో పామును తినడం వంటి వీడియోలకు అయితే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇక సయ్యాట ఆడుతున్న పాము వీడియోలను కూడా జనం ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా మరొక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిలో రెండు కాదు, మూడు విషపూరిత పాములు సయ్యాట ఆడుతూ కనిపించాయి.
సాధారణంగా, మనం రెండు పాముల జతకట్టడం చూస్తుంటాం. అందులో ఒకటి ఆడపాము మరొకటి మగపాము అని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మూడు పాముల జతకట్టిన్నట్లు ఉంది. నిజానికి, మీరు ఈ వీడియోను జాగ్రత్తగా చూస్తే, రెండు పాములు జతకడుతుండగా… మూడవ పాము వాటి మధ్యలోకి అడ్డుగా వెళ్లడం మీరు చూస్తారు. ఆ తర్వాత, మూడు పాములు ఒకదానికొకటి చుట్టుకొని కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలగక మానదు.
ఈ వీడియోను @Emate-TV అనే YouTube ఖాతాలో షేర్ చేశారు. ఇప్పటివరకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తున్నారు.
