AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: సజ్జల సమైక్య రాగంపై స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన షర్మిల.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దంటూ హితవు

విభజనకు వైసీపీ అనుకూలమా అంటూ ఉండవల్లి కామెంట్‌ చేయడం, ఆయనకు కౌంటర్‌గా సజ్జల చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు.

YS Sharmila: సజ్జల సమైక్య రాగంపై స్ట్రాంగ్‌ కౌంటరిచ్చిన షర్మిల.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దంటూ హితవు
Ys Sharmila, Sajjala
Basha Shek
|

Updated on: Dec 08, 2022 | 7:57 PM

Share

తెలుగు రాష్ట్రాల విభజన జరిగి సుమారు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. అయినా అప్పటి పరిణామం ఇప్పటికీ పొలిటికల్‌ సెగలు రేపుతోంది. విభజనకు వైసీపీ అనుకూలమా అంటూ ఉండవల్లి కామెంట్‌ చేయడం, ఆయనకు కౌంటర్‌గా సజ్జల చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను ఏకం చేసేందుకు ఏ అవకాశం దొరికినా తమ పార్టీ ఓటు వేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. నేడు తెలంగాణ ఒక వాస్తవం. ఎంతోమంది బలిదానాలు, ఎంతో మంది త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి. విభజిత రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు, మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు’ అని ట్విట్టర్‌ వేదికగా సజ్జలకు స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు షర్మిల.

2014లో జరిగిన ఉమ్మడి ఏపీ విభజన మరోసారి తెలుగు రాష్ట్రాల్లో మాటల యుద్ధానికి దారితీస్తోంది. విభజన తీరు సరిగా లేదని సుప్రీంకోర్టులో వేసిన కేసుపై ఉండవల్లి చేసిన కామెంట్లే ఈ రాజకీయ దుమారం కారణం. విభజనకు వ్యతిరేకం కాదన్నట్లు ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించడం ఏంటని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఈ వ్యవహారంపై ఉండవల్లికి కౌంటర్‌ ఇస్తూ ఏపీ, తెలంగాణ మళ్లీ కలుస్తాయంటే తొలి ఓటు తామే వేస్తామన్నారు సజ్జల. అయితే సజ్జల కామెంట్స్‌పై తెలంగాణ నుంచి గట్టిగా రియాక్షన్స్‌ వస్తున్నాయి. ఇద్దరు సీఎంలు కలిసి డ్రామాలాడుతున్నారని ఘాటుగా విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌. టీఆర్‌ఎస్‌, వైసీపీలను కలిపి బీజేపీ విమర్శిస్తే, వైసీపీ, బీజేపీ కలిపే ఈ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించింది గులాబీ దళం. ఇక కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ సజ్జల వ్యాఖ్యలను చూస్తుంటే మళ్లీ తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..