AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రాయదుర్గం టూ శంషాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌కు అయ్యే ఖర్చెంత..? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది..?

రాయదుర్గం టూ శంషాబాద్.. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌కు శుక్రవారం భూమిపూజ జరగబోతోంది. సిటీ మెట్రోలో సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. అలాంటివి రిపీట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంతకీ ఈ మెట్రోకు అయ్యే ఖర్చెంత? ప్రాజెక్ట్ డీపీఆర్‌ ఎలా ఉండబోతోంది?

Hyderabad: రాయదుర్గం టూ శంషాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లైన్‌కు అయ్యే ఖర్చెంత..? ఎప్పుడు కంప్లీట్ అవుతుంది..?
Hyderabad Metro (-Photo: Nagara Gopal)
Ram Naramaneni
|

Updated on: Dec 08, 2022 | 9:46 PM

Share

హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు శుక్రవారం సీఎం కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నానక్ రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతుంది. బయోడైవర్సిటీ దగ్గర ప్రస్తుతమున్న రెండు ఫ్లైఓవర్ల పైన మెట్రో లైన్ అలైన్మెంట్ వస్తుందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. 6,250 కోట్ల రూపాయలతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో పలు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

డీపీఆర్‌ను బయటకు ఇస్తే పలు కారణాలతో కేసులు

ఈ ఫేస్-2కి సంబంధించి రెండు డీపీఆర్‌లను కేంద్రానికి పంపించామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. డీపీఆర్‌ను బయటకు ఇస్తే పలు కారణాలతో కేసులు అయ్యి.. పనులు జరగడం లేదన్నారు. అందుకే డీపీఅర్‌ను బయటికి ఇవ్వకుండా కేంద్రానికి పంపామన్నారు. ఇలాంటి కేసులతోనే సిటీ మెట్రో 6 నెలలు ఆగిపోయిందన్నారు. ఎయిర్ పోర్ట్ మెట్రోకి అలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు. ప్రస్తుతం సిటీలో 80 కిలోమీటర్ల మాక్సిమం స్పీడు ఉంటే ఎయిర్ పోర్ట్ మెట్రో 120 కిలోమీటర్ల హై స్పీడ్‌తో వెళ్లేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.

‘800 కోట్ల ప్రాజెక్టునే పూర్తి చేయటానికి సహకరించని కేసీఆర్..?’

మరోవైపు ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాడు రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం వద్దన్న వ్యక్తికి.. నేడు ఎయిర్ పోర్టు మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెట్రో ఫేజ్ – I లో భాగమైన ఓల్డ్ సిటీ మెట్రో పనులను ఎప్పుడు ప్రారంభిస్తారు? MMTS ఫేజ్ – II ప్రాజెక్టుకు ఇవ్వవలసిన నిధులను ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఎనిమిదిన్నరేళ్లలో 800 కోట్ల ప్రాజెక్టునే పూర్తి చేయటానికి సహకరించని కేసీఆర్.. 6,250 కోట్ల ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానంటే ప్రజలు నమ్మాలా? అని నిలదీశారు.

శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ హైవేను రూపొందించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను విస్తరిస్తోంది ప్రభుత్వం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..