Kishan Reddy: ఆనాడు వద్దన్నారు.. ఈనాడు కావాలంటున్నారు.. సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి ఫైర్..

హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరిపడినంత రవాణా అందించడంపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాయదుర్గం నుంచి ఎయిర్...

Kishan Reddy: ఆనాడు వద్దన్నారు.. ఈనాడు కావాలంటున్నారు.. సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి ఫైర్..
Central Minister Kishan Reddy
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 08, 2022 | 7:10 PM

హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరిపడినంత రవాణా అందించడంపై అధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు పూర్తి రాష్ట్ర బడ్జెట్ తో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో పనులు ప్రారంభించే విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మెట్రో రైలు విషయంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకున్నారు. “హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోకు శంకుస్థాపన చేయటానికి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి, రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణాన్ని చేపట్టనీయం, ఎవ్వరినీ ఒక్క గజం కూడా తిరగనీయం అంటూ గతంలో తాను చేసిన హెచ్చరికలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే బాగుంటుంది!!” అని కౌంటరిచ్చారు.

ఇప్పటికే ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైఫల్యం నుంచి దృష్టిని మరల్చడానికి, హైదరాబాద్ ఎంఎంటీఎస్ కు రాష్ట్ర వాటాను అందించడానికి తెలంగాణ సీఎం హైదరాబాద్ విమానాశ్రయం మెట్రోకు పునాది వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరుగుతున్నప్పుడు రక్తపాతం జరుగుతుందని వాగ్దానం చేయడం నుంచి ఇప్పుడు కొత్త ఎయిర్‌పోర్ట్ లైన్‌కు శంకుస్థాపన చేయడం వరకు సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకోవడం తన వైఫల్యాలను దాచుకోవడమే. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, స్టేజ్-4 సికింద్రాబాద్‌లో ఫలక్‌నుమాలోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచ్, చార్మినార్ మీదుగా హైదరాబాద్ పాతబస్తీలో ప్లాన్ చేశారు. అయితే అది మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లో నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కారణంగా ఖర్చుల భారం పడుతోంది. ఇది ప్రయాణీకులపై ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా విద్యార్థులు, యువత పేద వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

     – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

గతంలో హైదరాబాద్ మెట్రో భూసేకరణకు సాకుగా ఉందని చెప్పిన కేసీఆర్..ఇప్పుడు అదే పనులను ప్రారంభించడం చూస్తుంటే ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, ప్రజలను మోసం చేయడానికి కొత్త దశలను ప్రారంభించడం దురదృష్టకరమని ఆరోపించారు. ఈ పనులను 2016 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినా.. పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..