YSRTP: షర్మిల తెలంగాణ రాజకీయ అరంగేట్రం, ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం
వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం పక్కా ప్రణాళికలకే పరిమితమైన ఆమె, పది రోజులుగా..
వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇంతకాలం పక్కా ప్రణాళికలకే పరిమితమైన ఆమె, పది రోజులుగా కార్యచరణ షురూ చేసి బిజీబిజీ అయిపోయారు. వివిధ జిల్లాల అభిమానులతో పార్టీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోటస్ పాండ్ లో నల్గొండ అభిమానులతో సమావేశమైన షర్మిల, ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులతో సమావేశం కానున్నారు. బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్‌లో 7వందల మంది వైఎస్ అభిమానులతో ఇవాళ షర్మిల సమావేశమవనున్నారు. ఇక మార్చి 2న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఇలా.. ఏప్రిల్ 10 వరకు అన్ని జిల్లాల నాయకులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతాయి. చివరిగా ఖమ్మం జిల్లా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.