Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఒకనొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే..

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 20, 2021 | 9:29 AM

Gold Price Today: బంగారం ధరల నేలచూపులు చూస్తుండడం కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. అయితే ఇది చాలా స్వల్పమనే చెప్పాలి. ఒకానొక సమయంలో తులం బంగారం రూ.55 వేలకు చేరువైన సందర్భాలు చూశాం. అయితే ప్రస్తుతం మాత్రం బంగారం ధరలు పతనమవుతున్నాయి. శనివారం కూడా దేశీయ మార్కెట్లో బంగారు ధరలు తగ్గాయి. ఈరోజు దేశ వ్యాప్తంగా 10 గ్రాముల బంగారం ధర వివరాలు ఎలా ఉన్నాయంటే.. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం శుక్రవారంతో పోలిస్తే రూ.10 తగ్గి, 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.45,140 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి.. రూ.49,270వద్ద ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10 తగ్గి, రూ.45,120 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,120 వద్ద ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర నిన్నటితో పోలిస్తే రూ.20 తగ్గి, రూ.42,990 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ విషయానికొస్తే రూ.10 తగ్గి, రూ.46,890గా ఉంది. విజయవాడలోనూ బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రూ.42,990 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.450 తగ్గి, రూ.46,900 వద్ద ఉంది. ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.43,000గా నమోదైంది. 24 క్యారెట్ల విషయానికొస్తే రూ.10 తగ్గి.. రూ. 46,890 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.43,470 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.47,390 వద్ద కొనసాగుతోంది.

Also Read: Petrol Diesel Price Today: పెట్రోల్‌ ధరల దూకుడుకు అడ్డుకట్ట పడేదెన్నడు..? వరుసగా 12వ రోజు పెరిగిన ధరలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!