Yellandu Politics: నువ్వా.. నేనా..? సింగరేణి గడ్డపై సిగపట్లు.. ఇల్లందులో హాట్ హాట్‌గా పాలిటిక్స్.. ఒకేరోజు రెండు సభలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ గత కొన్ని రోజుల నుంచి హీటెక్కుతున్నాయి. నాయకుల వరుస సమావేశాలతో ఖమ్మం పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడి కాస్త సింగరేణి గడ్డకు తాకింది.

Yellandu Politics: నువ్వా.. నేనా..? సింగరేణి గడ్డపై సిగపట్లు.. ఇల్లందులో హాట్ హాట్‌గా పాలిటిక్స్.. ఒకేరోజు రెండు సభలు..
Yellandu Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 23, 2023 | 8:20 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ గత కొన్ని రోజుల నుంచి హీటెక్కుతున్నాయి. నాయకుల వరుస సమావేశాలతో ఖమ్మం పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ వేడి కాస్త సింగరేణి గడ్డకు తాకింది. దీంతో పోటా పోటీ సమావేశాలతో భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు పాలిటిక్స్ ఒక్కసారిగా మారాయి. ఓ వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ ఒకే రోజు సమావేశాలకు పిలుపునిచ్చారు. బలప్రదర్శనా లేక ఆత్మీయ సమ్మేళనమా అనే విధంగా పరిస్థితులు మారాయి. ఈ మధ్య కాలంలో పొలిటికల్‌గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాక్టివ్ అయ్యారు. తన అనుచరులు, అభిమానులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా ఇల్లందులో ఆత్మీయసమావేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు మాజీ ఎంపీ పొంగులేటి.

ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యే హరిప్రియ కూడా ఇదే రోజు ఓ సమావేశానికి పిలుపునిచ్చారు. ఇల్లందు మున్సిపాలిటీ పాలక వర్గం ఏర్పాటై మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. మునిసిపల్ చైర్మన్ వెంకటేశ్వర రావు దగ్గరుండి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్ సభకు ఆహ్వానం పంపినా వెళ్లని కనకయ్య..

కాగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సమావేశానికి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ సభకు కనకయ్యకు ఆహ్వానం పంపినా వెళ్లలేదు. పొంగులేటి వెంటే తానూ అన్నట్టుగా ఉంది ఆయన తీరు.

ఇవి కూడా చదవండి

2018లో హరిప్రియ చేతిలో చేతిలో ఓటమి

2014 ఎన్నికల్లో ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కనకయ్య.. కారెక్కారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి హరిప్రియ చేతిలో ఓడిపోయారు. చేయి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే హరి ప్రియ కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో వర్గపోరు, విభేదాలు తారా స్థాయికి చేరాయి.

ఆత్మీయ సమ్మేళనాలా.. లేక బలప్రదర్శనా?

ఇప్పుడు అటు మాజీ ఎంపీ వర్గం, ప్రస్తుత ఎమ్మెల్యే వర్గం ఒకే రోజు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇవి ఆత్మీయ సమ్మేళనాలా.. లేక బలప్రదర్శనా అనే విధంగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఎవరి సమావేశంలో ఎవరు ప్రత్యక్షమవుతారు. ఏ నేతలు ఎవరివైపు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..