Nirmal: ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్.. కలకలం రేపుతున్న ఇన్సిడెంట్.. పోలీసులకు సవాల్..
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మిస్సింగ్.. కలకలం రేపుతోంది. భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన పుష్పలత.. తన ఇద్దరు పిల్లలతో ఐదు రోజులుగా కనిపించడం లేదని ఆమె...
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మిస్సింగ్.. కలకలం రేపుతోంది. భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన పుష్పలత.. తన ఇద్దరు పిల్లలతో ఐదు రోజులుగా కనిపించడం లేదని ఆమె తల్లి భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పుష్పలతకు 3 సంవత్సారాల కూతురు, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారని బాధితురాలు కంప్లైంట్ లో వివరించారు. వీరు ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగి రాలేదని, చుట్టు పక్కలా వెతికినా లాభం లేకుండా పోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తె, మనువల ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను కోరారు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపులే కారణమా..లేక ఆర్థిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లి పోయారా అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమవడం గ్రామంలో సంచలనంగా మారింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి దావానలంలా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం