Telangana: ఎంత పని చేశావమ్మా..! ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి..
మంచిర్యాల లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో శనివారం ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు ఉరి వేసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది.
Mancherial District: పాపం.. ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో ఏమో.. ఇద్దరు కూతుళ్లకి ఉరేసి చంపి ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మంచిర్యాల లక్సెట్టిపేటలోని గోదావరి రోడ్డులో శనివారం ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు పిల్లలకు ఉరి వేసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. మృతులు చెన్నల ధనలక్ష్మి(23), సమాన్విత (6), ఆరు నెలల సంకరమ్మగా గుర్తించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం బంధువులు, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ధనలక్ష్మి మూడు నెలల గర్భవతి అని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో లక్సెట్టిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..