AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి భార్య పక్కా ప్లానింగ్.. స్కెచ్ ఏంటో తెలిస్తే ఫ్యూజులవుట్

ఒక అత్యాశ. అది నెరవేరనిదైనా.. ఎలాగైనా సరే దాన్ని నెరవేర్చుకోవాలన్న గట్టి తలంపు. దీంతో ఎక్కడా లేని బరితెగింపు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ మంచిర్యాల జిల్లాలో జరిగిన దారుణ ఘటన. ఒకటి కాదు.. రెండు కాదు పలుమార్లు హత్యాయత్నం చేసి.. చివరికి విజయం సాధించిందా కిరాతకురాలు

Telangana: భర్తను చంపడానికి ప్రియుడితో కలిసి భార్య పక్కా ప్లానింగ్.. స్కెచ్ ఏంటో తెలిస్తే ఫ్యూజులవుట్
Telangana
Surya Kala
|

Updated on: Aug 21, 2022 | 12:13 PM

Share

Telangana: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్న భర్తని కడతేర్చే కర్కశత్వానికి ఉసిగొల్పింది. ఒక్కసారి కాదు రెండుసార్లు భర్తపై హత్యాయత్నానికి ఒడిగట్టిన యువతి, మూడోప్రయత్నంలో భర్తని కడతేర్చిన ఘటన యిప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని, ప్రియుడితో కలిసి భర్తనే అత్యంత కిరాతకంగా హతమార్చిన ఓ భార్య క్రైం కథా చిత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సంచలనాత్మకంగా మారింది. మొదట ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్టు నాటకమాడినా, పోలీసుల ప్రమేయంతో అసలు క్రైంకథా చిత్రం బట్టబయలైంది. ఇంతకీ అసలేం జరిగింది?

స్వయంగా మేనమామ కొడుకు రాజేందర్‌. ఇద్దరు పండంటి పిల్లలు. తనకోసం కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చే భర్త. ఏడడుగుల బంధం. ఏడేళ్ళ వైవాహిక జీవితాన్ని ఐదు నిముషాల్లో ధ్వంసం చేసుకుంది భార్య రవళి. మంచిర్యాల జిల్లా చెన్నూరు కిష్టంపేటకు చెందిన రవళికి, రాజేందర్‌కి ఏడేళ్ళ క్రితం వివాహం జరిగింది. పెళ్ళయినా అంటీముట్టనట్టు ఉంటోన్న భార్య తీరు వెనుక వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గుర్తించిన రాజేందర్‌ అనేక సార్లు హెచ్చరించాడు. వీరికి ఇద్దరు పండంటి పిల్లలు పుట్టారు. అయినా ఆమె తీరు మారలేదు. భార్యాభర్తల మధ్య గొడవలూ ఆగలేదు. ఇటీవలే పంచాయితీలో కలిసిబతుకుతానని మాటిచ్చి ఇంటికొచ్చింది రవళి.

అత్తమామల నుంచి వేర్పడదామన్నా భర్త రాజేందర్‌ కాదనలేదు. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ భార్యబిడ్డల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే భార్య రవళి వైఖరిలో ఏ మార్పూలేదు. ప్రియుడితో వ్యవహారం యథావిధిగా సాగింది. తమ వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలంటే భర్తని అడ్డుతొలగించుకోవాలని ప్లాన్‌ చేసింది ప్రియుడితో కలిసి. నిద్దరపోతోన్న భర్తను పడుకున్నవాడిని పడుకున్నట్టే తుపాకీతో కాల్చి చంపేశాడు ప్రియుడు. ప్రియుడిరాకకోసం తలుపులు బార్లా తెరిచి ఉంచిన భార్య ఎవరో దుండగులు తన భర్తని హతమార్చినట్టు కట్టుకథ అల్లి అలవోకగా చెప్పేసింది. ఎవరో ఇద్దరు హెల్మెట్‌ పెట్టుకుని తన భర్తపై కాల్పులు జరిపారంటూ కాకమ్మ కథలు చెప్పింది. కాకపోతే గతంలోనూ రాజేందర్‌ పై భార్య జరిపిన హత్యాయత్నాల సంగతి తెలియడంతో తమదైన శైలిలో నిజాన్ని బయటపెట్టించారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

గతంలో సైతం భర్త రాజేందర్‌ని కారుతో ఢీకొట్టించి హతమార్చేప్రయత్నం చేసింది రవళి. కానీ తీవ్రగాయాలపాలైన రాజేందర్ బతికి బయటడ్డాడు. ఆ తరువాత ఇనుప గేటుకి కరెంటు షాక్‌ వచ్చేలా విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి క్రూరమైన మర్డర్‌ ప్లాన్‌ చేసింది రవళి. అయినా బయటపడ్డాడు రాజేందర్‌. కానీ మూడోసారి ప్రియుడితో పకడ్బందీగా ప్రణాళిక వేసి, భర్తను కణతలపై కాల్చి చంపించింది వైల్డ్‌ వైఫ్‌ రవళి.  రవళి సన్నిహితుడు బందం రాజు, సయ్యద్‌తో కలిసి తన కొడుకుని హత్యచేయించిందని మృతుడి తండ్రి మొండయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..