AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లోక సభ ఎన్నికల్లో సీపీఐ పొత్తు ఎవరితో.. సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేనా..

పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పరిస్థితి ఏంటీ. పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే.. కరీంనగర్ ఎంపి టికెట్‎ను డిమాండ్ చేయకున్నా.. పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత కరువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది సిపిఐ. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ బరిలోకి దిగింది.

Telangana: లోక సభ ఎన్నికల్లో సీపీఐ పొత్తు ఎవరితో.. సీట్ల విషయంలో క్లారిటీ వచ్చేనా..
Cpi Alliance With Congress
G Sampath Kumar
| Edited By: Srikar T|

Updated on: Mar 24, 2024 | 10:57 AM

Share

పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పరిస్థితి ఏంటీ. పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే.. కరీంనగర్ ఎంపి టికెట్‎ను డిమాండ్ చేయకున్నా.. పొత్తుల విషయంలో ఇంకా స్పష్టత కరువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది సిపిఐ. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయితే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్‎లో బలంగా ఉన్నామని.. అవసరమైతే ఇండిపెండెంట్‎గా బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నామని సిపిఐ నేతలు చెబుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మూడు సెగ్మెంట్‎లో సీపీఐ బలంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో హుస్నాబాద్, సిరిసిల్లలో సిపిఐ విజయం సాధించింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలని నేతలు పట్టుబట్టారు. సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. కానీ.. కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగారు. ఇక్కడ పొన్నంకు సిపిఐ సహకరించింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల విషయంలో పొత్తుల అంశం ఓ కొలిక్కి రావడం లేదు.

ఇప్పటికే.. సిపిఐ వరంగల్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఒక్క వేళ వరంగల్ ఇవ్వకపోతే కరీంనగర్ పార్లమెంట్ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్‎ను కోరుతోంది. ఇక్కడ హుస్నాబాద్, సిరిసిల్ల, మానకొండూరులో.. బలంగా ఉన్నామని అంతేకాకుండా.. మిగతా నియోజకవర్గాల్లో తమకు మంచి బలం ఉందన్న విషయాన్ని చెబుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో తమ పార్టీ బలహీనంగా మారుతుందనే భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవడనికి కమ్యునిస్టులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా.. పొత్తుల విషయంలో క్లారిటీ లేదు. కాంగ్రెస్ మాత్రం మొత్తం స్థానాల్లో బరిలో దిగేందుకు మొగ్గు చూపుతుంది. బలంగా ఉన్న స్థానాల్లో మరింత ఫోకస్ పెట్టాలని సిపిఐ నిర్ణయించింది. ఇప్పటికే సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడ బిజెపి బలంగా ఉన్న నేపథ్యంలో.. తమ పార్టీ సహకరం అవసరమని నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. సిపిఐ కూడా అవకాశం ఇస్తే పోటీకి సై అంటుంది. కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పొత్తుల విషయంలో క్లారీటీ ఇస్తే కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని సిపిఐ నేతలు చెబుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా.. సిపిఐతో పొత్తు ఉండాలనే కోరుకుంటున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో ఓట్లు చీలకుండా చూసుకోవాలని అంటున్నారు. మొత్తానికి పొత్తుల విషయంలో త్వరగా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు సిపిఐ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..