AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TCongress రేవంత్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయొద్దంటూ సీఎంకు సూచనలు

రాజకీయాల్లో అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు.  ఎన్నికల్లో గెలుపు ఓటమలు సహజం. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ ఉదాహరణ. వరుసగా రెండు పర్యాయాలు పార్టీ అధికారంలో ఉన్న ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అయితే బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు.

TCongress రేవంత్ పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేయొద్దంటూ సీఎంకు సూచనలు
V Hanumantha Rao
Balu Jajala
|

Updated on: Mar 24, 2024 | 10:49 AM

Share

రాజకీయాల్లో అధికారం ఏ ఒక్కరికి శాశ్వతం కాదు.  ఎన్నికల్లో గెలుపు ఓటమలు సహజం. ఇందుకు బీఆర్ఎస్ పార్టీ ఉదాహరణ. వరుసగా రెండు పర్యాయాలు పార్టీ అధికారంలో ఉన్న ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. అయితే బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో ఎంపీ సీట్ల కోసం సొంత పార్టీ నేతలు లాబీయింగ్ కొనసాగుతుంటే.. కొత్తగా చేరేవారితో ఇబ్బందికర పరిస్తితులు నెలకొనే అవకాశం ఉంది.

అయితే అదే సమయంలో కాంగ్రెస్ కూడా చేరికలపై జాగ్రత్తగా అడుగులు వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా కాంగ్రెస్ చేరికలపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం మంచిది కాదని, ఇలా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకోవాల్సి వస్తుందన్నారు. ఇది ఎంతమాత్రం కాదని వీహెచ్ అన్నారు.

పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని రేవంత్ రెడ్డిని వీహెచ్ కోరారు. కాంగ్రెస్ గెలుపు గురించి మాట్లాడుతూ.. పార్టీ ప్రకటించిన పథకాలు తాము అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయన్నారు. అయితే భారీగా చేరికలు ఎప్పుడూ గొడవకు దారితీసే అవకాశం ఉంది. సాధారణంగా పదవుల ఆశతో నేతలు ఇతర పార్టీల్లో చేరుతుంటారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని వి.హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలాని భావిస్తోంది. తమకు కలిసి వచ్చిన తుక్కుగూడ గడ్డపై భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్స్ ను సొంతం చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.