Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆగస్టు 3న అసెంబ్లీకి జలగం? స్పీకర్ కోర్టులో బంతి.. ఎటూ తేల్చని అసెంబ్లీ..

Hyderabad: జలగం వెంకట్ రావును 2018 నుండి ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కోర్టు తీర్పు కాపీతో జలగం వెంకట్ రావు అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అవ్వడం, అటు నుండి ఎన్నికల కమిషన్‌ని కలిసి నిర్ణయం తీసుకోమని కోరడం జరిగిన విషయమే. అటు వనమా వెంకటేశ్వర్ రావు తీర్పుపై స్టె ఇవ్వండిని, సుప్రీం కోర్టుకు వెళ్లాలని అని కోరడం..

Telangana: ఆగస్టు 3న అసెంబ్లీకి జలగం? స్పీకర్ కోర్టులో బంతి.. ఎటూ తేల్చని అసెంబ్లీ..
Vanama Venkateswara Rao Vs Jalagam Venkat Rao
Follow us
Sridhar Prasad

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 01, 2023 | 12:26 PM

హైదరాబాద్, ఆగస్టు 01: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదు అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా ఖమ్మం రాజకీయాల్లో పెను దుమారం లేచిన విషయం తెలిసిందే బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన జలగం వెంకట్ రావును 2018 నుండి ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కోర్టు తీర్పు కాపీతో జలగం వెంకట్ రావు అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అవ్వడం, అటు నుండి ఎన్నికల కమిషన్‌ని కలిసి నిర్ణయం తీసుకోమని కోరడం జరిగిన విషయమే. అటు వనమా వెంకటేశ్వర్ రావు తీర్పుపై స్టె ఇవ్వండిని, సుప్రీం కోర్టుకు వెళ్లాలని అని కోరడం.. దానికి హైకోర్టు నో చెప్పడం కూడా జరిగిపొయింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరిలో ఎవరు అసెంబ్లీకి హాజరవుతారు? ఎన్నికల కమిషన్ ఏమంటుంది? స్పీకర్ ఈ రెండు రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

కోర్టు నిర్ణయంపై ఇప్పటి వరకు అటు బిఆర్ఎస్ అదిష్టానము కూడా స్పందించలేదు. హై కోర్టు స్టె కు నిరాకరించడంతో తీర్పును అమలు చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ స్పీకర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలకు ఎవరు వెళ్ళాలి అన్నది తాజా మాజీల మధ్య సందిగ్దంగా మారింది. ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఘర్షణ వాతావరణానికి పోలేరు. అటు జలగం కూడా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి అడుగుపెట్టాలి కాబట్టి స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఒక వేళ స్పీకర్ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడితే మాత్రం ఈసారి సభలకు వనమా కూడా హాజరుకాబోరని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
అన్నం తిన్న వెంటనే టీ తాగుతున్నారా.? శరీరంలో ఏం జరుగుతుందంటే..
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
'స్థానికుల సహకారంతోనే ఉగ్ర దాడి.. అందుకే హిందువులు టార్గెట్‌'
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
బ్లాక్ బెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా..? డయాబెటీస్‌ ఉన్న వారికి
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
ఉగ్రదాడిలో మరణించిన హీరోయిన్ తండ్రి.. కిడ్నాప్ చేసి ఏడు రోజులు ..
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
Viral Video: పెళ్లి వేడుకలో వధూవరులు తుపాకీతో సంబరాలా?...
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ముక్కురాజు మాస్టర్ నంబర్ వన్‌
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
నరమేధానికి మినీ స్విట్జర్లాండ్‌‌ ఎందుకు?
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
సొంత కిడ్నీని వేరే స్థానంలో అమర్చిన వైద్యులు - పేషెంట్ సేఫ్
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
Viral Video: వడాపావ్‌కు పడిపోయిన హాంకాంగ్ ప్రియురాలు...
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..
అవకాశాలు లేక స్పెషల్ సాంగ్.. 42 ఏళ్ల వయసులో హీరోయిన్ రిస్క్..