Telangana: బీఆర్‌ఎస్ నేతలను కలవరపెడుతోన్న ఎలక్షన్ పిటిషన్లు.. 30 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదా.?
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పైన పడ్డ అనర్హత వేటు తర్వాత చాలా మంది లీడర్లు తమ ఎమ్మెల్యే పదవికి ఏమవుతుందన్న టెన్షన్‌లో ఉన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో జరిగిన వివిధ కారణాలు, ఎన్నికల్లో జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపులో జరిగిన వ్యత్యాసాల పైన దాదాపు 30 మందికి పైగా ప్రజాప్రతినిధులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అయిన తర్వాత చాలా చోట్ల జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపు కావచ్చు, ఓట్ల లెక్కింపు సంబంధించి అవక తవకుల పైన పైన విచారణ జరిపించాలని చాలామంది కోర్టును ఆశ్రయించారు.

మరో ఆరు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ అధికార పార్టీ నేతలని ఎలక్షన్ పిటిషన్లు కలవరపెడుతున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పైన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనార్హత వేటు తర్వాత పిటిషన్లు ఎదుర్కొంటున్న నేతల్లో టెన్షన్ నెలకొంది. దాదాపు 28 ఎలక్షన్ పిటిషన్లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఆగస్టు ఎండింగ్ లోపు ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ పిటిషన్‌ల పైన జడ్జిమెంట్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో లీడర్లు అంతా టెన్షన్ గురవుతున్నారు.
కొత్తగూడెం ఎమ్మెల్యే పై అనర్హత వేటు!
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పైన పడ్డ అనర్హత వేటు తర్వాత చాలా మంది లీడర్లు తమ ఎమ్మెల్యే పదవికి ఏమవుతుందన్న టెన్షన్‌లో ఉన్నారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో జరిగిన వివిధ కారణాలు, ఎన్నికల్లో జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపులో జరిగిన వ్యత్యాసాల పైన దాదాపు 30 మందికి పైగా ప్రజాప్రతినిధులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అయిన తర్వాత చాలా చోట్ల జరిగిన గొడవలు, ఓట్ల లెక్కింపు కావచ్చు, ఓట్ల లెక్కింపు సంబంధించి అవక తవకుల పైన పైన విచారణ జరిపించాలని చాలామంది కోర్టును ఆశ్రయించారు.
ఎన్నికల అఫీడవిట్లలో తప్పులున్నాయంటూ పిటిషన్లు..
కొంతమంది లీడర్లు ఎన్నికలు అప్పుడు సరైన ఆస్తులు సరైన కేసులు సమర్పించిన కారణంగా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని అఫిడవిట్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చి జలగం వెంకట్రావుని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా అధికమైన టెన్షన్ నెలకొంది. తెలంగాణ హైకోర్టులో ఎన్నికలకు సంబంధించి న పిటిషన్లు ఎదుర్కొంటున్న , పెండింగ్లో ఉన్న నియోజకవర్గాలు గమనిస్తే మంచిర్యాల, హుస్నాబాద్, గద్వాల్, మహబూబ్నగర్, దేవరకొండ, అసిఫాబాద్, పటాన్చెరు, ఖైరతాబాద్, వేములవాడ, సికింద్రాబాద్, కొడంగల్, ఇబ్రహీంపట్నం, మహబూబ్నగర్, వరంగల్ ఈస్ట్, ఆలేరు, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కరీంనగర్, ధర్మపురి, కోదాడ, నాగర్ కర్నూల్, గోషామహల్, మహబూబ్నగర్, వికారాబాద్ ,గజ్వేల్, పరిగి, జనగాం, కరీంనగర్, నాంపల్లి, కొత్తగూడెం, దాదాపు 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్‌లు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి.

ఆగస్టులోపు తేలనున్న నేతల భవితవ్యం..
ఆగస్టు నెల చివరిలోపు ఎలక్షన్ పిటిషన్‌లని పూర్తిస్థాయిలో ఆర్డర్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ 30 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని టెన్షన్ ఎమ్మెల్యేలు నెలకొంది. మరొక ఆరు నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి ఆర్డర్ వస్తుందో టెన్షన్ ప్రజా ప్రతినిధులు నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..