Telangana: అమరవీరుల ప్రాణ త్యాగాలకు కారణం ఎవరు.. మాజీమంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? అని నిలదీశారు. తెలంగాణలో ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.

తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. తన ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల? అని నిలదీశారు. తెలంగాణలో ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాజముద్ర, తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే.. సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలను బీఆర్ఎస్ తప్పుబడుతోంది. తాజగా వెలుగులోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర రాజముద్ర లోగోపై అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఆమరవీరుల స్థూపం ఏర్పాటు కావడానికి కారణం ఎవరు అంటూ కేటీఆర్ చురకలు అంటించారు.
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు? అని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ అమరవీరుల కోసం కాంగ్రెస్ చేస్తున్న విధానాలకు సంబంధించి చారిత్రాత్మక విషయాలను గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు? అని అడిగారు. అలాగే 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ? అంటూ ప్రశ్నలు సంధించారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? అంటూ విమర్శించారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరని అడిగారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరని ఘాటుగా స్పందించారు.
తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?
1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరు?
— KTR (@KTRBRS) May 31, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




