February 29: ఫిబ్రవరి 29.. ప్రత్యేకమైన రోజు.. కారణం ఏంటంటే..
లీప్ ఇయర్ పిబ్రవరిలో 29 రోజులు వచ్చే సంవత్సరమిది. ఈరోజు పుట్టిన వారు,పెళ్లి చేసుకున్న వారు.. నాలుగు ఏళ్ళకు ఒకసారి వేడుక జరుపుకోవాల్సిందే. మిగతా వారు ప్రతి సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నా.. వీరు మాత్రం 4 సంవత్సరాలు ఆగాల్సిందే. ఖగోళ సంవత్సరంతో క్యాలెండర్ లో వచ్చే తేడాను సరి చేయడానికి లీప్ సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 29 రోజును పలువురు ప్రత్యేకంగా భావిస్తున్నారు..

లీప్ ఇయర్ పిబ్రవరిలో 29 రోజులు వచ్చే సంవత్సరమిది. ఈరోజు పుట్టిన వారు,పెళ్లి చేసుకున్న వారు.. నాలుగు ఏళ్ళకు ఒకసారి వేడుక జరుపుకోవాల్సిందే. మిగతా వారు ప్రతి సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నా.. వీరు మాత్రం 4 సంవత్సరాలు ఆగాల్సిందే. ఖగోళ సంవత్సరంతో క్యాలెండర్ లో వచ్చే తేడాను సరి చేయడానికి లీప్ సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 29 రోజును పలువురు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఇదే రోజు పుట్టిన వారు పుట్టిన రోజును, పెళ్లి చేసుకున్న వారు వార్షికోత్సవాన్ని నాలుగేళ్లకోసారి జరుపుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా భావిస్తూ ఆ వేడుక వినూత్నంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 29 న మంచి ముహూర్తం ఉండడంతో పలువురు తమ జీవితంలో జ్ఞాపకంగా భద్రపర్చుకోవాలనే భావనతో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఖమ్మం నగరానికి చెందిన హర్ష ఫిబ్రవరి29 న జన్మించడంతో అమ్మా నాన్నలు కల్యాణ్ కుమార్, శ్రీలక్ష్మి నాలుగేళ్లకోసారి పుట్టిన రోజు ఘనంగా చేస్తున్నారు. ఖమ్మం నగరంలోని సెంట్ జోసెఫ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న అస్మిత ఫిబ్రవరి 29న పుట్టడంతో నాలుగేళ్లకోసారి పుట్టినరోజు జరుపుకుంటుంది.
పుట్టిన రోజును అమ్మాన్నాలు రవి సుకన్యతో పాటు బంధువులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటానంటుంది అస్మిత. నేను ఇప్పుడు ఆరో తరగతి చదువుతున్న మా సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో స్నేహితులంతా నాకు నాలుగేళ్లకోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారంటుంది. ఈ చిన్నారి..ఈ ప్రత్యేక రోజును కుటుంబ సభ్యులు,బందువులు, స్నేహితులు మధ్య ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




