Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది.

Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తారు వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 05, 2021 | 8:13 AM

Telangana Weather Report Today: తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పలుచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, ఆదివారం తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 2.1 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు పేర్కొన్నారు.

కాగా, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెలంగాణవ్యాప్తంగా 90 ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో 4.8, రంగారెడ్డి జిల్లా వెలిజాలలలో 3.8, నల్గొండ జిల్లా చలకుర్తిలో 3.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందనట్ల హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Read Also… 

Drunk and Drive: మళ్లీ యాక్షన్ సీన్‌లోకి సైబరాబాద్ పోలీసులు.. రావడం రావడంతోనే డ్రంకన్ డ్రైవర్లకు ఊహించని ఝలక్..

 Telangana: పశువుల రక్తం తాగుతున్న సైకో..!! తాజాగా లేగదూడను చంపి…!! ( వీడియో )