Godavari Bridge Closed: భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం.. రాకపోకలు బంద్.. జలదిగ్బంధంలో మంచిర్యాల
Godavari Bridge Closed: తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక భద్రాచలం దగ్గర గోదావరి అంతకంతకు మహోగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 60 అడుగులు దాటిన గోదావరి ప్రవాహం రాత్రికి..
Godavari Bridge Closed: తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక భద్రాచలం దగ్గర గోదావరి అంతకంతకు మహోగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 60 అడుగులు దాటిన గోదావరి ప్రవాహం రాత్రికి 68 అడుగులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో భద్రాచలం వంతెనపై ఈ సాయంత్రం నుంచి రాకపోకలు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక జారీ చేశారు భద్రాద్రి కలెక్టర్ అనుదీప్. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారో ఆరా తీస్తున్నారు.
జలదిగ్బంధంలో మంచిర్యాల..
మంచిర్యాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎగువ నుంచి శ్రీరామ్‌సాగర్,ఆపై ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో మంచిర్యాల పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 54 గేట్లు ఎత్తివేయడంతో ఇప్పటికే మంచిర్యాలలోని కాలనీల్లోకి వరద చేరింది. ఇళ్లను వరద చుట్టుముట్టింది. ఇళ్లను వరద చుట్టుముట్టడంతో ఫస్ట్ ప్లోర్‌కి చేరుకున్నారు. ఇటు రెస్య్యూటీమ్ ఇళ్ల నుంచి జనాలనుకు బయటకు తీసుకువస్తున్నారు. రాళ్లవాగు ప్రవాహంతో మంచిర్యాలకు వరద ముప్పు పెరుగుతోంది. మంచిర్యాలలోని ఎన్టీఆర్ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రామ్‌నగర్, పద్మశాలీవాడతో పాటు పలు కాలనీల్లోకి చేరింది. గోదావరి బ్రిడ్జిపై నుండి వరద నీరు పోటెత్తడంతో కరీంనగర్, మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైపూర్ మండలం ఇందారం వద్ద గోదావరి బ్రిడ్జి పై నుండి వరద ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిపివేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి