Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు మీకోసం..

Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో ట్రాక్ నుండి..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు మీకోసం..
Hmwssb
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2021 | 10:11 PM

Hyderabad: హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో ట్రాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. దాంతో ఒక రోజు పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. 04-08-2021 తేదీన అంటే బుధవారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు 05-08-2021 తేదీన అంటే గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ జంక్షన్ పనులు జరుగనున్నాయి. దాంతో మంచి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ముఖ్యంగా ఈ క్రింతి ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలివే.. 1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహింద్ర హిల్స్. 7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

నీటి సరఫరాలో అంతరాయం కలుగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు.

Also read:

ఆడపిల్లలకు అర్ధరాత్రి బీచ్ లో ఏం పని..?తల్లిదండ్రులకు బాధ్యత లేదా?-గోవా సీఎం:GOA CM Pramod Sawant Video.

Andhra Pradesh: టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం మరో టర్న్.. ఎమ్మెల్యే రాచమల్లు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం..

Tokyo Olympics: నిద్రలేచింది మహిళా లోకం..టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల కంటే మహిళలకే ఇప్పటివరకూ ఎక్కువ పతకాలు..ఆ లెక్క ఇలా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే