Tokyo Olympics: నిద్రలేచింది మహిళా లోకం..టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల కంటే మహిళలకే ఇప్పటివరకూ ఎక్కువ పతకాలు..ఆ లెక్క ఇలా..

ఒలింపిక్ క్రీడల్లో మహిళలు జయకేతనం ఎగురవేస్తున్నారు. పురుషాధిక్య క్రీడా ప్రపంచంలో తమను మించిన శక్తి లేదని నిరూపిస్తున్నారు.

Tokyo Olympics: నిద్రలేచింది మహిళా లోకం..టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల కంటే మహిళలకే ఇప్పటివరకూ ఎక్కువ పతకాలు..ఆ లెక్క ఇలా..
Tokyo Olympics
Follow us
KVD Varma

|

Updated on: Aug 01, 2021 | 10:03 PM

Tokyo Olympics: ఒలింపిక్ క్రీడల్లో మహిళలు జయకేతనం ఎగురవేస్తున్నారు. పురుషాధిక్య క్రీడా ప్రపంచంలో తమను మించిన శక్తి లేదని నిరూపిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన టోక్యో ఒలింపిక్ పోటీల్లో క్రీడాకారులకంటే.. క్రీడాకారిణులు అత్యధిక పతకాలను గెలిచారు. ఒలింపిక్ క్రీడలలో మహిళలు, పురుషుల పతక ఈవెంట్‌లు సమానంగా ఉంటాయి. అయితే, పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఐదు దేశాలలో, మహిళల పతకాలు పురుషుల కంటే 67% ఎక్కువ. ఈ ఐదు దేశాల మహిళలు ఇప్పటివరకు మొత్తం 194 పతకాలు సాధించగా, పురుషులు 116 పతకాలు సాధించారు. పతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న చైనా మహిళలు అక్కడ పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువ పథకాలను సాధించారు. అయితే, మూడవ స్థానంలో ఉన్న అమెరికన్ మహిళలు మూడు రెట్లు ఎక్కువ పురుషుల కంటే ఎక్కువ పతకాలు గెలుచుకున్నారు.

జపాన్, రష్యా మరియు ఆస్ట్రేలియాలో కూడా ఇదే ధోరణి ఉంది. ఇప్పటివరకు పతకాల సంఖ్యను చూస్తే, అమెరికా,  చైనా మహిళలు పురుషులు గెలిచినట్లే తక్కువ పతకాలు గెలిచి ఉంటె..ఈ రెండు దేశాలు పతకాల జాబితాలో రష్యా , ఆస్ట్రేలియా కంటే వెనుకబడి ఉండేవని స్పష్టమవుతోంది. అంటే, ఇప్పటివరకు క్రీడల్లో అత్యుత్తమంగా నిరూపించబడిన దేశాలలో, పురుషుల కంటే మహిళల పాత్ర ఎక్కువగా ఉంది. భారతదేశం ఇప్పటివరకు ఒక రజత పతకాన్ని గెలుచుకుంది, ఒక కాంస్యపతకం గెలుచుకుంది. ఈ రెండూ కూడా మహిళలే కావడం విశేషం.

ఇదీ మహిళల శక్తి..

టోక్యోలో ఇప్పటివరకు రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన 35 మంది మహిళలు.. 19 మంది పురుషులు

4 పతకాలు గెలిచింది… ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మాత్రమే 3 పతక విజేతలు: మొత్తం 8 మంది క్రీడాకారులు, వారిలో 5 మంది మహిళలు 2 పతక విజేతలు: మొత్తం 45 మంది క్రీడాకారులు, వారిలో 29 మంది మహిళలు ( ఈ సంఖ్య జూలై 31 వరకు .. ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు జరుగుతాయి. )

ఈ పతకాల పోలిక ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా జరిగింది.

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ ఐదు దేశాల నుంచి మొత్తం 2450 మంది అథ్లెట్లు ఉన్నారు. వీరిలో 1354 (55.3%) మహిళలు మరియు 1096 (44.7%) పురుషులు. అంటే, ఒలింపిక్స్‌లో ఈ దేశాల ఆధిపత్యాన్ని నిరూపించే బాధ్యత పురుషుల కంటే మహిళలపై ఎక్కువగా ఉందనేది స్పష్టం. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. పురుషులు మాత్రమే రాణించగలరని ప్రపంచమంతా నమ్మే  గుర్రపు స్వారీలో కూడా మహిళలు ముందున్నారు. ఇప్పటి వరకు ఓపెన్ కేటగిరీలో 12 పతకాలు అందుకోగా… అందులో 10 పతకాలు మహిళలకు దక్కాయి.

ఒలింపిక్స్‌లో గుర్రపుస్వారీ పోటీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. ఇందులో పురుషులు లేదా మహిళలు ఎవరైనా పాల్గొనవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఇప్పటివరకు మొత్తం 12 పతకాల ఈవెంట్‌లు జరిగాయి. ఇందులో 10 పతకాలను మహిళలు గెలుచుకోగా, పురుషులు కేవలం 2 పతకాలు మాత్రమే సాధించారు. ఇది ఒకరకంగా పురుషాధిక్యం పై మాట్లాడేవారికి చెంప పెట్టులాంటి విషయమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.

Also Read: Tokyo Olympics 2020 Highlights: ఓ వైపు కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు..మరోవైపు సెమీస్‌లో భారత పురుషుల హాకీ జట్టు

Tokyo Olympics: ఒలింపిక్స్ లో తొలిసారి పోటీపడుతున్న ట్రాన్స్‌జెండర్..వివాదాల మధ్యే అర్హత కల్పించిన ఒలింపిక్ నిర్వాహకులు!

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.