Tokyo Olympics 2020 Highlights: ఓ వైపు కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు..మరోవైపు సెమీస్‌లో భారత పురుషుల హాకీ జట్టు

Surya Kala

|

Updated on: Aug 01, 2021 | 7:11 PM

Tokyo Olympics 2020 Highlights: టోక్యో ఒలింపిక్స్‌‌లో పదో రోజు ఆదివారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు 41 ఏళ్ల నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదింపుతూ సెమి ఫైనల్ లోకి అడుగు పెట్టింది.

Tokyo Olympics 2020 Highlights: ఓ వైపు కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు..మరోవైపు సెమీస్‌లో భారత పురుషుల హాకీ జట్టు
Tokyo Olympic

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌‌లో పదో రోజు ఆదివారం భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు 41 ఏళ్ల నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదింపుతూ సెమి ఫైనల్ లోకి అడుగు పెట్టింది.

టోక్యో ఒలింపిక్స్‌.. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కంచు మోగించింది పీవీ సింధు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. నిన్నటి లోపాలను సరిదిద్దుకొని సింధు చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై అవలీలగా గెలిచింది.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈరోజు టోక్యో ఒలంపిక్స్ లో ఉమెన్స్ సింగిల్స్ లో కాంస్య పతకం కోసం హి బింగ్‌ జియావోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కనుక సింధు గెలిస్తే.. రెండు ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలను తెలిచిన మొదటి భారతీయ మహిళాగా రికార్డ్ సృష్టిస్తుంది. గత రియో ఒలంపిక్స్ లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే

శనివారం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నిరాశే దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన పోరాటాన్ని సెమీస్‌లో నిరాశ పరిచింది. అలాగే బాక్సర్లు అమిత్ పంగల్, పూజారాణి ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. హాకీ మహిళలు అద్భుత విజయంతో క్వార్టర్స్ ఫైనల్ చేరుకున్నారు. ఆర్చర్ అతాను దాస్ కూడా పతకం సాధించకుండా నిరాశపరిచాడు. అథ్లెటిక్స్‌లో కమల్‌ప్రీత్ ఫైనల్‌ చేరడం ఒక్కటే గుడ్ న్యూస్ దక్కింది. అయితే ఆదివారం కూడా భారత అథ్లెట్లు పలు పోటీల్లో పాల్గొననున్నారు. పీవీ సింధు కాంస్య పోరులో చైనా ప్లేయర్ హే బింగ్ జియో‌తో పోరాడనుంది.

భారతదేశానికి 10 వ రోజు పోటీలు గోల్ఫ్ కోర్స్, ఈక్వెస్ట్రియన్‌తో ప్రారంభం కానున్నాయి. ఈరోజు పూర్తి షెడ్యూల్ ఇదే..

Tokyo Olympics 2021 India Schedule (1)

మహిళల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్‌లో పీవీ సింధుతో మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కానుంది. రియో 2016 లో ఆమె రజతం తర్వాత వరుసగా ఒలింపిక్ పతకం గెలిస్తే.. దేశ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారత మహిళగా పేరుగాంచనుంది. అలాగే సుశీల్ కుమార్ తర్వాత మొత్తం రెండవ వ్యక్తి కానుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Aug 2021 07:01 PM (IST)

    బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో గెలిచి భారత పురుషుల హాకీ టీం.. సెమీస్‌లోకి అడుగు

    టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు బ్రిటన్ పై గెలిచి సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. దీంతో ఒలింపిక్స్ లింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. 1960 మాస్కో లో జరిగిన ఒలింపిక్స్ తరువాత పతకం సాధించే దిశగా పురుషుల హాకీ జట్టు అడుగులు వేసింది. సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా భారత్, బ్రిటన్ జట్లు బరిలోకి దిగాయి. మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం 3-1 గోల్స్ తేడా తో గెలిచింది.

  • 01 Aug 2021 06:09 PM (IST)

    రెండు గోల్స్‌తో బ్రిటన్‌పై ఆధిక్యంతో కొనసాగుతున్న భారత మెన్స్ హాకీ టీమ్ ‌

    టోక్యో ఒలంపిక్స్ లో భారత్ పురుషుల హాకీ జట్టు అసలు సిసలు పరీక్ష ఎదుర్కొంటుంది. సెమీఫైనల్లో స్థానం కోసం భారత జట్టు బ్రిటన్ తో తలపడుతుంది. గెలుపే లక్ష్యంగా మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం బరిలోకిదిగింది. రెండు గోల్స్ చేసి బ్రిటన్ పై ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టోక్యో ఒలంపిక్స్ పతక రేస్ లో నిలుస్తుంది.

  • 01 Aug 2021 06:03 PM (IST)

    టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్యం అందుకున్న తెలుగుతేజం పీవీ సింధు

    టోక్యో ఒలింపిక్స్‌.. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు కాంస్యం పతకం అందుకుంది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పీవీ సింధు చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై ఆదినుంచి అధిపత్యం చెలాయించింది. పదునైన ఏస్ లతో ర్యాలీలతో విరుచుకుపడింది. మొదటి సెట్ ను 21-13 తేడాతో పీవీ సింధు సొంతం చేసుకుంది. రెండో సెట్ లో కూడా హోరాహోరీగా తలపడింది. రెండో సెట్ లో కూడా బింగ్‌ జియావో పై ఆధిపత్యం కొనసాగించింది.  21-15 తేడాతో గెలిచి.. మ్యాచ్ తో పాటు టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం అందుకుంది. దీంతో భారత రెండో పతకం లభించింది.

  • 01 Aug 2021 05:59 PM (IST)

    మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కంచు మోగించింది పీవీ సింధు

    టోక్యో ఒలింపిక్స్‌.. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో కంచు మోగించింది పీవీ సింధు. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. నిన్నటి లోపాలను సరిదిద్దుకొని సింధు చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై అవలీలగా గెలిచింది.

  • 01 Aug 2021 05:32 PM (IST)

    మొదటి మ్యాచ్ ను గెలిచిన పీవీ సింధు

    టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి హి బింగ్ జియావోపై పివి సింధు 21-13 తేడాతో గెలిచింది.

  • 01 Aug 2021 05:18 PM (IST)

    కాంస్యం కోసం హోరాహోరీగా పోరాడుతున్న పీవీ సింధు-బింగ్‌ జియావో

    టోక్యో టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో కాంస్య కోసం పోరు ప్రారంభమైంది . పీవీ సింధు-బింగ్‌ జియావోలు లు మూడో స్థానం కోసం పోరాడుతున్నారు.  సింధు, బింగ్‌ జియావో మధ్య ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరగ్గా… సింధు 6 సార్లు, జియావో 9 సార్లు నెగ్గింది. అయితే ఈ పోటీలో గెలిచిన విజేత కాంస్య పతకం అందుకోనుంది. అయితే సింధు కాంస్యం గెలిస్తే.. ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలను అందుకున్న మొదటి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది.

  • 01 Aug 2021 05:13 PM (IST)

    హి బింగ్‌ జియావో తో కాంస్య పతకం కోసం పోరాడుతున్న సింధు

    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈరోజు టోక్యో ఒలంపిక్స్ లో ఉమెన్స్ సింగిల్స్ లో కాంస్య పతకం కోసం హి బింగ్‌ జియావోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కనుక సింధు గెలిస్తే.. రెండు ఒలంపిక్స్ లో రెండు వ్యక్తిగత పతకాలను తెలిచిన మొదటి భారతీయ మహిళాగా రికార్డ్ సృష్టిస్తుంది. గత రియో ఒలంపిక్స్ లో రజతం గెలిచిన సంగతి తెలిసిందే

  • 01 Aug 2021 10:27 AM (IST)

    బాక్సింగ్ – క్వార్టర్ ఫైనల్‌లో ముగిసిన సతీష్ కుమార్ పోరాటం

    సతీష్ కుమార్ చివరి రౌండ్‌లో 0: 5 తేడాతో ఓడిపోయాడు. పతక రేసు నుంచి ఔటయ్యాడు. ఈ మ్యాచులో అస్సలు పోరాటం కూాడా ఇవ్వలేక, వెనుదిరిగాడు.

  • 01 Aug 2021 09:11 AM (IST)

    బాక్సర్ సతీష్ కుమార్‌పేనే అందరి కళ్ళు

    ఒలింపిక్స్‌లో పాల్గొనే భారతదేశపు మొదటి సూపర్ హెవీవెయిట్ (91 కిలోలు ప్లస్) బాక్సర్ సతీష్ కుమార్ మొదటి మ్యాచ్‌లో జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు. ఇద్దరు బాక్సర్‌లకు ఇది తొలి ఒలింపిక్స్.

  • 01 Aug 2021 07:38 AM (IST)

    కీలక పోరులో భారత పురుషుల హాకీ టీం

    భారత్, గ్రేట్ బ్రిటన్‌ల మధ్య పురుషుల క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 1980 లో స్వర్ణం గెలిచిన తర్వాత నాకౌట్‌ చేరడం ఇదే మొదటిసారి. 41 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం భారత హాకీ టీం ముందు ఉంది.

  • 01 Aug 2021 07:34 AM (IST)

    కాంస్య పోరులో సింధు

    మహిళల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్‌లో పీవీ సింధుతో మ్యాచ్ సాయంత్రం ప్రారంభం కానుంది. రియో 2016 లో ఆమె రజతం తర్వాత వరుసగా ఒలింపిక్ పతకం గెలిస్తే.. దేశ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారత మహిళగా పేరుగాంచనుంది. అలాగే సుశీల్ కుమార్ తర్వాత మొత్తం రెండవ వ్యక్తి కానుంది.

Published On - Aug 01,2021 7:06 PM

Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!