Tokyo Olympics 2021: 41 ఏళ్ల నిరీక్షణకు తెరదింపిన భారత హాకీ జట్టు.. బ్రిటన్‌పై గెలిచి సగర్వంగా సెమీస్‌లోకి అడుగు

Tokyo Olympics 2021 Men in Blue: టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు బ్రిటన్ పై గెలిచి సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. దీంతో ఒలింపిక్స్ లింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు..

Tokyo Olympics 2021: 41 ఏళ్ల నిరీక్షణకు తెరదింపిన భారత హాకీ జట్టు.. బ్రిటన్‌పై గెలిచి సగర్వంగా సెమీస్‌లోకి అడుగు
India Hockey
Follow us
Surya Kala

|

Updated on: Aug 01, 2021 | 7:19 PM

Tokyo Olympics 2021 Men in Blue: టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు బ్రిటన్ పై గెలిచి సగర్వంగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. దీంతో ఒలింపిక్స్ లింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. 1960 మాస్కో లో జరిగిన ఒలింపిక్స్ తరువాత పతకం సాధించే దిశగా పురుషుల హాకీ జట్టు అడుగులు వేసింది. సెమీ ఫైనల్స్ లో అడుగు పెట్టడమే లక్ష్యంగా భారత్, బ్రిటన్ జట్లు బరిలోకి దిగాయి. మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం 3-1 గోల్స్ తేడా తో గెలిచింది.మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు దూకుడుగా ఆడింది. బ్రిటన్‌ గోల్ పోస్టు పై వరస దాడులు చేసింది. బ్రిటన్ ను గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. మరోవైపు మొదటి క్వార్టర్ లోనే ఏడో నిమిషంలోనే దిల్ ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. అనంతరం రెండో క్వార్టర్ లో గుర్జత్‌సింగ్‌ రెండో గోల్ సాధించాడు. మూడో క్వార్టర్ చివరి నిమిషంలో బ్రిటన్ ఒక గోల్ చేసి.. గోల్స్ ఆధిక్యాన్ని 2-1 కి తగ్గించింది. అయితే చివరి క్వార్టర్ లో హార్దిక్ సింగ్ మూడోగోల్ చేసి.. భారత్ కు స్పష్టమైన ఆధిక్యంతో పాటు గెలుపుని అందించాడు.

పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. కోచ్ గ్రాహం రీడ్, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు గ్రూప్ దశలో మంచి ప్రదర్శన కనబరిచింది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో 5-3తో ఆతిథ్య జపాన్‌ను ఓడించి, పూల్ ఏలో రెండవ స్థానంలో నిలిచి బ్రిటన్ తో తలపడింది.

2016 రియో ఒలింపిక్స్‌లోనూ భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. భారత పురుషుల హాకీ జట్టు చివరిసారి 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొన్నా టీమిండియా ఒక్కసారీ కూడా సెమీఫైనల్‌ దశకు అర్హత సాధించలేకపోయింది. ఈసారి ఒలంపిక్స్ లో పతక కోసం గెలుపే లక్ష్యంగా మన్‌ప్రీత్‌ సింగ్‌ బృందం జైత్ర యాత్ర కొనసాగిస్తుంది.

Also Read: Tokyo Olympic 2020: టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తెలుగు తేజం.. కాంస్యం అందుకున్న పీవీ సింధు

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.