PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని

PV Sindhu: టోక్యో ఓలింపిక్స్‌లో పీవీ సింధు అద్భుతమైన పోరాట పటిమతో చరిత్ర సృష్టించింది.  మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతాకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి..

PV Sindhu: కాంస్యం గెలిచిన సింధుకు యావత్ భారతం జేజేలు.. సింధు దేశానికి గర్వకారణం అంటున్న ప్రధాని
Sindhu Pm
Follow us
Surya Kala

|

Updated on: Aug 01, 2021 | 9:18 PM

PV Sindhu: టోక్యో ఓలింపిక్స్‌లో పీవీ సింధు అద్భుతమైన పోరాట పటిమతో చరిత్ర సృష్టించింది.  మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతాకాన్ని అందుకుంది. వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించి చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్‌ బింగ్‌ జియావోపై వరసగా సెట్స్ ను గెలిచి కాంస్యం అందుకుంది. భారత దేశానికి రెండో పతాకం అందించింది. దీంతో పీవీ సింధు పై యావత్ భారత దేశం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

దేశ ప్రధాని మోడీ.. ట్విట్టర్ వేదికగా సింధు తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. భారత అత్యుత్తమ ఒలింపియన్లలో ఒకరైన సింధు ఒలింపిక్స్ లో పతకం గెలవడం సంతోషంగా ఉంది. సింధు దేశానికి గర్వకారణం అంటూ ఆమెకు అభినందనలు అని చెప్పారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సింధు విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సింధుని సీఎం కేసీఆర్ అభినందించారు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించడం చాలా సంతోషకరంగా కేసీఆర్ ఉందని ప్రశంసించారు.

ఇక ఏపీ సీఎం జగన్ కూడా తెలుగు తేజం సింధు ని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. భారత దేశానికి రెండు వ్యక్తిగత ఒలంపిక్స్ అందించిన తెలుగు అమ్మాయి సింధు అంటూ అభినందనలు తెలిపారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పి.వి.సింధు పోరాట పటిమకు జేజేలు చెప్పారు. ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్యం గెలుచుకొని మన దేశానికి మరో పతకాన్ని అందించిన పి.వి.సింధుకి పవన్ కళ్యాణ్ , జనసేన పక్షాన హృదయపూర్వక అభినందలు చెప్పారు. అంతేకాదు టోక్యోలో మన దేశ పతాకం మరోమారు రెపరెపలాడేలా చేసిన సింధుని చూసి దేశమంతా గర్విస్తోంది. క్రీడా రంగంలో సింధు ఘన విజయాలు సాధించేలా తీర్చిదిద్దిన ఆమె తల్లితండ్రులకు అభినందనలని తెలిపిన పవన్ కళ్యాణ్ సింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

Also Read: Bicycle Journey: కేరళ టూ కాశ్మీర్ ఓ యువతి సైకిల్ పై యాత్ర.. యువతకు స్వేచ్ఛ ఇవ్వాలంటున్న తండ్రి

TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?
లేటు వయసులో పెళ్లిపీటలెక్కిన నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరో తెలుసా?