AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: ఒలింపిక్స్ లో తొలిసారి పోటీపడుతున్న ట్రాన్స్‌జెండర్..వివాదాల మధ్యే అర్హత కల్పించిన ఒలింపిక్ నిర్వాహకులు!

టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ కు చెందిన వెయిట్ లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ మహిళల 87 కేజీల విభాగంలో పోటీకి బరిలో దిగింది.

Tokyo Olympics: ఒలింపిక్స్ లో తొలిసారి పోటీపడుతున్న ట్రాన్స్‌జెండర్..వివాదాల మధ్యే అర్హత కల్పించిన ఒలింపిక్ నిర్వాహకులు!
Tokyo Olympics
KVD Varma
|

Updated on: Aug 01, 2021 | 4:54 PM

Share

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ లో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ కు చెందిన వెయిట్ లిఫ్టర్ లారెల్ హబ్బర్డ్ మహిళల 87 కేజీల విభాగంలో పోటీకి బరిలో దిగింది. అయితే, ఈ విషయంపై వివాదం చెలరేగింది. అయినప్పటికీ ఆమెను పోటీ చేయడానికి నిర్వాహకులు అనుమతి ఇచ్చారు. తనకు ఒలింపిక్స్ లో పోటీచేయడానికి అనుమతి ఇవ్వడంపై లారెల్ ఒలింపిక్స్ నిర్వాహకులకు ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు. ఒలింపిక్ క్రీడల 125 సంవత్సరాల చరిత్రలో వ్యక్తిగత క్రీడలో పాల్గొన్న మొదటి బహిరంగ లింగమార్పిడి అథ్లెట్ హబ్బర్డ్ ఈమె ఇలా చెప్పింది. “ఒలింపిక్ క్రీడలు మా ఆశలు, మా ఆదర్శాలు, మన విలువలకు ప్రపంచ వేడుక. ఈ పోటీల్లో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదములు.”

లారెల్ 2012లో లింగమార్పిడి చేయించుకుంది. ఆమె ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనడం కోసం కావలసిన మద్దతును సాధించడం, ఆటలో పాల్గొనే అవకాశాన్ని అనిపుచ్చుకోవడం అనే అంశాలపై దృష్టిపెట్టింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) జరిపిన టెస్టోస్టెరాన్ స్థాయిలపై హబ్బర్డ్ అర్హత ప్రమాణాలను అందుకుంది. ఐవోసీ 2016 లో ట్రాన్స్ అథ్లెట్ల కోసం తన నియమాలను సవరించింది. ఆ నియమాల ప్రకారం జరిపిన పరీక్షల్లో లారెల్ అర్హత సాధించింది.

ఐవోసీసలహాదారులలో ఒకరు లాఫ్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన జోవన్నా హార్పర్, మీడియాతో మాట్లాడుతూ “అవును, లారెల్‌కు ప్రయోజనాలు ఉన్నాయి – కానీ ఆమె  14 మంది మహిళల సమూహంలో పోటీ చేస్తోంది, లారెల్ బహుశా వారందరి మధ్యలో ఎక్కడోఉంది. ఆమె సిద్ధాంతపరంగా 3 నుండి 14 వ స్థానం వరకు ఎక్కడైనా పూర్తి చేయగలదు” అంటూ చెప్పుకొచ్చారు.

విమర్శకులు మాత్రం  లారెల్ ఒలింపిక్స్ లో పోటీచేయడం ఇతర పోటీదారులకు అన్యాయం చెయయడమే అని విమర్శించారు. ఇది  అన్యాయమని  వారన్నారు. లారెల్ హబ్బర్డ్ సహజంగా బలంగా ఉన్నారని వాదించారు. అంతకుముందు ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ తాను నియమాలను మరింత సమీక్షించాలని , చివరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.  ఎందుకంటే ఇది ఒక పరిమాణానికి సరిపోయే పరిష్కారం లేని ప్రశ్న అని ఆయన చెప్పారు.

ఇన్ని వివాదాల మధ్యలో తనను ఒలింపిక్ పోటీలకు అనుమతించడంపై లారెల్ సంతోషంగా ఉంది. అదే సమయంలో చాలామంది ఈమెతో పోటీపడుతున్న వారికి ఎక్కువగా మద్దతు ఇస్తూ ఉండటం గమనార్హం.

Also Read: Tokyo Olympics 2020: రిఫరీ నిర్ణయంపై బాక్సర్ నిరసన.. ఎందుకో తెలుసా?

Viral Video: స్విమ్మింగ్‌లో ఛాంపియన్.. భావోద్వేగంతో చిన్నపిల్లాడిలా కన్నీళ్లు..! వైరలవుతోన్న వీడియో