Viral Video: స్విమ్మింగ్‌లో ఛాంపియన్.. భావోద్వేగంతో చిన్నపిల్లాడిలా కన్నీళ్లు..! వైరలవుతోన్న వీడియో

అమెరికన్ స్విమ్మర్ కాలెబ్ డ్రెసెల్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కేవలం 49.45 సెకండ్లలో 100మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌ను పూర్తిచేసి బంగారు పతకం సాధించాడు. దీంతో తన రికార్డును తనే బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

Viral Video: స్విమ్మింగ్‌లో ఛాంపియన్.. భావోద్వేగంతో చిన్నపిల్లాడిలా కన్నీళ్లు..! వైరలవుతోన్న వీడియో
American Swimmer Caeleb Dressel
Follow us
Venkata Chari

|

Updated on: Aug 01, 2021 | 1:52 PM

Viral Video: అమెరికన్ స్విమ్మర్ కాలెబ్ డ్రెసెల్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కేవలం 49.45 సెకండ్లలో 100మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌ను పూర్తిచేసి బంగారు పతకం సాధించాడు. దీంతో తన రికార్డును తనే బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 2019లో 49.50 సెకన్లలో నెలకొల్పిన రికార్డును కొల్లడొట్టాడు. అయితే కాలెబ్‌కు ఇది వ్యక్తిగత విభాగంలో తొలి బంగారు పతకం కావడం విశేషం. దీంతో భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. బంగారు పతకం అందుకున్న తరువాత తన ఫ్యామిలీతో ఆ ఆనందం పంచుకుంటూ కన్నీళ్లపర్వంతమయ్యాడు. మాట్లాడుతూనే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన ఫ్యామిలీలో కూడా కొంతమంది ఆనందభాష్పాలు రాల్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఒకే ఒలింపిక్స్‌లో మొత్తం ఐదు బంగారు పతకాలు సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఒకే ప్రపంచకప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన లిస్టులో 5వ స్థానంలో నిలిచాడు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా ఆయనకు మద్దతుగా కామెంట్లు చేశారు. అద్భుత విజయం సాధించినప్పుడు ఇలాంటి భావోద్వేగాలు వస్తూనే ఉంటాయంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరిన్ని పతకాలు కొల్లగొట్టాలి అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Also Read:

Tokyo Olympics 2020: ఏడు పతకాలు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా స్విమ్మర్.. పలు రికార్డులకు ఎసరు..!

India vs England: టీమిండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్.. అరంగేట్ర టెస్టులోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు దడ పుట్టించాడు

బెన్ స్టోక్స్ కంటే ముందు.. మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రికెటర్లెవరో తెలుసా..?