India vs England: టీమిండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్.. అరంగేట్ర టెస్టులోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు దడ పుట్టించాడు
ఈ బౌలర్ తన పదునైన బంతులతో ఇంగ్లండ్ శిబిరంలో గందరగోళాన్ని సృష్టించాడు. భారత తరపున అరంగేట్రం చేసిన అత్యంత వేగవంతమైన బౌలర్‌గా రికార్డలను నెలకొల్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడితే.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరు మొదట ఉంటుంది. ఆ తరువాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు వస్తాయి. అయితే సునామీ వేగంతో బౌలింగ్ వేసిన ఓ భారత బౌలర్ ఉన్నాడని మీకు తెలుసా? ఇలాంటి ఓ ఫాస్ట్ బౌలర్ ఇంగ్లండ్‌పై టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను అరంగేట్రం చేయడమే కాకుండా.. తన వేగంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు దడ పుట్టించాడు. ఈ రోజున అంటే ఆగస్టు 1 న ఈ బౌలర్ పుట్టినరోజు.
భారత క్రికెట్ సూపర్ స్టార్ మహ్మద్ నిస్సార్.. 1910 ఆగస్టు 1 న జన్మించాడు. 1932-33 సంవత్సరంలో ఇంగ్లండ్‌పై భారత్ తరపున అరంగేట్రం చేశారు. లార్డ్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నిసార్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నిసార్ ఒక వికెట్ తీశాడు. నిసార్ అప్పుడు టీమిండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్. టెస్ట్ క్రికెట్‌లో అతను తీసుకున్న 25 వికెట్లలో 13 వికెట్లు ఎల్బీడబ్ల్యూగా వచ్చాయి.
నిసార్ కెరీర్.. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ నిసార్ తన కెరీర్‌లో టీమిండియా తరపున కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను తన 11 ఇన్నింగ్స్‌లో 25 వికెట్లు తీశాడు. అత్యుత్తమ ప్రదర్శన 90 కి 5 వికెట్లు కాగా, ఈ మ్యాచ్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 135 పరుగులకు 6 వికెట్లు. నిసార్ ఒక ఇన్నింగ్స్‌లో మూడుసార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ విషయానికి వస్తే, మొహమ్మద్ నిసార్ 93 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో, అతను మొత్తం 396 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 17 పరుగులకు 6 వికెట్లుగా నమోదైంది. అదే సమయంలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతని తన ఖాతాలో 32 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు నమోదు చేశాడు. అయితే అతను మ్యాచ్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన సందర్భాలు మూడు ఉండడం గమనార్హం.
Also Read: బెన్ స్టోక్స్ కంటే ముందు.. మానసిక సమస్యలతో విరామం తీసుకున్న క్రికెటర్లెవరో తెలుసా..?
Indian Cricket Team: టీమిండియా అరంగేట్ర బౌలర్లపై ఆసీస్ మాజీ దిగ్గజం పొగడ్తల వర్షం.. ఎందుకో తెలుసా?