Water in Gas Cylinder: ‘ఇందేంది సారూ నేనాడ చూడలా.. వంట గ్యాస్ సిలిండర్‌లో నీళ్లేందీ?’ పరేషాన్ అయిన వినియోగదారుడు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటి మాదిరిగానే గ్యాస్ బుక్ చేసుకున్నాడు. వారం క్రితం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ సరఫరా అయ్యింది. దీంతో గ్యాస్ సిలిండర్‌ను స్టౌవు అనుసందానం చేశాడు. అప్పటి నుంచి బాగానే పనిచేసిందని చెప్పారు. అయితే ఆదివారం గ్యాస్ పొయ్యి ఎంత వెలిగించిన వెలగకపోవడంతో.. అసలు సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్ ను పరిశీలించాడు..
వరంగల్, జనవరి 29: వరంగల్‌లోని ఓ గ్యాస్ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. తమ గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ బదులు నీరు వస్తుందని లబోదిబోమన్నాడు. గ్యాస్‌కు బదులు నీళ్లు బయటికి రావడంత ఇదేం విడ్డూరం అంటూ విస్తుపోయాడు. ఈ వింత ఘటన ఆనోటా ఈనోటా పాకి స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకెళ్తే..
వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆకుల సత్యం అనే వినియోగదారుడు ఎప్పటి మాదిరిగానే గ్యాస్ బుక్ చేసుకున్నాడు. వారం క్రితం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి సిలిండర్ సరఫరా అయ్యింది. దీంతో గ్యాస్ సిలిండర్‌ను స్టౌవు అనుసందానం చేశాడు. అప్పటి నుంచి బాగానే పనిచేసిందని చెప్పారు. అయితే ఆదివారం గ్యాస్ పొయ్యి ఎంత వెలిగించిన వెలగకపోవడంతో.. అసలు సిలిండర్ లో గ్యాస్ ఉందా లేదా అనే అనుమానంతో గ్యాస్ సిలిండర్ ను పరిశీలించాడు. స్క్రూడ్రైవర్‌తో పిన్నుపై నొక్కగా గ్యాస్ వాసన రాకపోవడాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. సిలిండర్‌ను వంచి పిన్ను నొక్కితే నీరు వస్తోందని వాపోయాడు.
ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై సదరు వినియోగదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోమవారం ఏజెన్సీలో ఫిర్యాదు చేస్తామని అన్నాడు. వినియోగదారులను మోసం చేసే విధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వ్యవహారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. సిలిండర్‌లో గ్యాస్ కాకుండా నీళ్లు నింపి మోసం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరైన పర్యవేక్షన లేకుండా ఏజెన్సీ నడిపిస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు వినియోగదారుడు సత్యం డిమాండ్ చేశాడు. దీనిపై సాయిచేత్ర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను మీడియా సంప్రదించగా వారు తమకేం తెలియని ప్లేటు ఫిరాయించారు. సీల్ ఉన్న సిలిండర్‌నే వినియోగదారుకు పంపిణీ చేశామని, సిలిండర్‌లోకి నీరు ఎలా వచ్చి చేరిందో తమకు తెలియదని తెలిపారు. ఫిర్యాదు తీసుకొని విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.