Actress Sreela Majumdar: ప్రముఖ స్టార్ హీరోయిన్ కన్నుమూత.. క్యాన్సర్‌తో పోరాడుతూ ఓడిన నటి! సీఎం మమతా సంతాపం
ప్రముఖ స్టార్ హీరోయిన్ కన్నుమూశారు. మృణాల్ సేన్, శ్యామ్ బెనెగల్, ప్రకాష్ ఝా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి శ్రీల మజుందర్ ( 65) శనివారం తుది శ్వాస విడిచారు. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. నటి శ్రీలా మజుందార్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా సంతాపం..
కలకత్తా, జనవరి 28: ప్రముఖ స్టార్ హీరోయిన్ కన్నుమూశారు. మృణాల్ సేన్, శ్యామ్ బెనెగల్, ప్రకాష్ ఝా వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన నటి శ్రీల మజుందర్ ( 65) శనివారం తుది శ్వాస విడిచారు. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. నటి శ్రీలా మజుందార్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. అనేక భారతీయ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన శ్రీలా మరణం బెంగాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా బెంగాలీ నటి శ్రీల మజుందార్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకు కారణం లేకపోలేదు..1980ల్లో 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ మొదలుపెట్టిన శ్రీలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఏక్దిన్ ప్రతిదిన్ (క్వైట్ రోల్స్ ది డాన్, 1980), ఖరీజ్ (ది కేస్ ఈజ్ క్లోజ్డ్, 1982), అకలేర్ సంధానే (ఇన్ సెర్చ్ ఆఫ్ ఫామిన్; 1981) సినిమాల్లో శ్రీలా పోషించిన పాత్రలు విమర్శకుల ప్రశంసలు పొందింది. దిగ్గజ డైరక్టర్ మృణాల్ సేన్-శ్రీల కాంబోలో వచ్చిన పలు చిత్రాలు బెంగాలీ ఇండస్ట్రీలో ఐకానిక్‌గానూ నిలిచిపోయాయి. ఏక్దిన్ ప్రతిదిన్ మువీకి సీక్వెల్‌గా వచ్చిన ‘కౌశిక్ గంగూలీ’ ఆమె చివరి మువీ. ఈ మువీ గతేడాది విడుదలైంది. శ్రీలా తన కెరీర్‌లో మొత్తం 43 సినిమాల్లో నటించింది. రితుపర్ణో ఘోష్ రచించిన చోఖేర్ బాలి (ఏ ప్యాషన్ ప్లే, 2003) మువీలో ఐశ్వర్య రాయ్‌కి ఆమె వాయిస్ డబ్బింగ్ అందించారు.
Saddened by the news of the demise of film actress Sreela Majumdar today afternoon. Sreela was a noted and powerful actress who played outstanding roles in several significant Indian films.
It is a big loss for Bengal film industry and we shall miss her stellar presence. My…
— Mamata Banerjee (@MamataOfficial) January 27, 2024
గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీల, నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే కొన్నాళ్లు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో ఇంటికి తీసుకొచ్చేశారు. కానీ అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తను నటి భర్త, జర్నలిస్టు ఎస్ఎన్ఎమ్ అబ్ది మీడియాకు వెల్లడించారు. శ్రీలా మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.