‘కంటి ఆపరేషన్ తర్వాత మొదట మెగాస్టార్‌నే చూడాలి’.. చిన్నారి ‘చిరు’ కోరికను తీర్చేందుకు అన్నయ్య ఏం చేశారంటే?

ఓ నటుడిగా చిరంజీవిని పక్కన పెడితే ఆపదలో ఉన్నవారికి ఆయన ఆపద్బాంధవుడు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సహాయం చేసే గొప్ప మనసు మెగాస్టార్‌ది. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ఇలా చిరంజీవి సేవా గుణానికి ప్రత్యక్ష నిదర్శనాలు.

'కంటి ఆపరేషన్ తర్వాత మొదట మెగాస్టార్‌నే చూడాలి'.. చిన్నారి 'చిరు' కోరికను తీర్చేందుకు అన్నయ్య ఏం చేశారంటే?
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 28, 2024 | 9:32 AM

మెగాస్టార్‌ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ఘనత చేరింది. సినీ కళామతల్లికి ఆయన అందించిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించనుంది. 2006లోనే చిరంజీవికి పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్నిఅందుకోనున్నారు మెగాస్టార్‌. స్వయంకృషితో సినీ పరిశ్రమలో ఎదిగిన చిరంజీవికి పద్మవిభూషణ్‌ రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. దర్శక నిర్మాతలు, హీరోలు చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ ఆయనను సత్కరిస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు. ఓ నటుడిగా చిరంజీవిని పక్కన పెడితే ఆపదలో ఉన్నవారికి ఆయన ఆపద్బాంధవుడు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సహాయం చేసే గొప్ప మనసు మెగాస్టార్‌ది. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ఇలా చిరంజీవి సేవా గుణానికి ప్రత్యక్ష నిదర్శనాలు. కరోనా సమయంలో పనుల్లేక సినీ శ్రామికులు ఇబ్బందులు పడితే.. సీసీసీ పేరుతో అందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే ఆక్సిజన్‌ సిలిండర్లను ఉచితంగా అందజేశారు. చిరంజీవి సేవా కార్యక్రమాల్లో ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. మెగాస్టార్‌ చేసిన సహాయం, మేలు, దానాల గురించి అప్పుడప్పుడూ స్వయంగా సినీ ప్రముఖులే అందరితో పంచుకుంటుంటారు. తాజగా ప్రముఖ దర్శక నిర్మాత చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందట. ఓ చిన్నారి తన కంటి ఆపరేషన్ చేయించుకుందట. తాను కళ్లు తెరిస్తే మొదటగా మెగాస్టార్‌ చిరంజీవినే చూడాలని కోరుకుందట. అయితే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న చిరంజీవి చిన్నారి కోసం? వస్తారా? లేదా? అని తమ్మారెడ్డి అనుకున్నారట. ఫోన్ చేసి విషయం చెప్పాను.. ఆయన వస్తాను అన్నారు. డేట్ కూడా చెప్పమని అడిగారు. చెప్పిన సమయానికి ఆయన వచ్చేశారు.. ఆ పాప కళ్లు తెరిచే సరికి చిరంజీవి ముందు నిల్చున్నారు’ అంటూ తమ్మారెడ్డి అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. చిరంజీవి నిజంగానే ఆపద్భంధవుడు అంటూ అభిమానులు మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి గొప్పతనం తమ్మారెడ్డి మాటల్లో.. వీడియో ఇదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.