Monkey Man: హాలీవుడ్‌లోకి మన హనుమాన్.. మంకీ మ్యాన్ ట్రైలర్ చూశారా..?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఓ మాములు వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చి జనాలను ఎలా కాపాడతాడో ఈ సినిమాలో చూపించారు. హనుమంతుడి నేపథ్యంలో సూపర్ హీరో మూవీగా హనుమాన్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో హనుమాన్ సినిమా తప్ప మిగిలినవన్నీ సైలెంట్ అయ్యాయి. హనుమాన్ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఓ మాములు వ్యక్తికి సూపర్ పవర్స్ వచ్చి జనాలను ఎలా కాపాడతాడో ఈ సినిమాలో చూపించారు. హనుమంతుడి నేపథ్యంలో సూపర్ హీరో మూవీగా హనుమాన్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే హనుమాన్ సినిమాలనే ఇప్పుడు హాలీవుడ్ లోనూ ఓ సినిమా తెరకెక్కింది. హాలీవుడ్ లో మంకీ మ్యాన్ అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
హనుమంతుడి ఇతిహాసం స్ఫూర్తితో మంకీ మ్యాన్ సినిమాను కూడా తెరకెక్కించారు. అంతే కాదు ఇండియాలో ఈ సినిమాను చిత్రీకరించారు. మంకీ మ్యాన్ సినిమాలో దేవ్ పటేల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు దేవ్ పటేల్ హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్డాడు. గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ, హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్ లాంటి సినిమాలు చేసి హాలీవుడ్, బాలీవుడ్ లో పాపులర్ అయ్యాడు దేవ్.
ఈ సినిమా షూటింగ్ ఇండియాలోనే జరిగింది. ముంబై లో ఈ మూవీ షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో చాలా మంది బాలీవుడ్ నటులు నటించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. నా చిన్న తనంలో మా అమ్మ నాకు ఓ కథ చెప్పేది అంటూ ట్రైలర్ ను ప్రారంభించారు. బ్యాక్ గ్రౌండ్ లో హనుమంతుడి ఫోటోలను చూపించారు. అలాగే ట్రైలర్ మొత్తం యాక్షన్ స్సీన్స్ లో నింపేశారు. అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ బార్ గర్ల్ గా కనిపించనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
One small ember can burn down everything. #MonkeyManMovie only in theaters April 5. pic.twitter.com/hYO6MwcSev
— Monkey Man (@monkeymanmovie) January 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.