69th Hyundai Filmfare Awards 2024: 69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. బ్లాక్ లేడీని అందుకున్న సినిమాలు ఇవే

గత ఏడాది ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్‌లో తమ లుక్స్ తో మెస్మరైజ్ చేశారు. 2023లో విడుదలైన హిందీ చిత్రాలకు ఈ అవార్డులు లభించాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతలకు ప్రతిష్టాత్మక బ్లాక్ లేడీని అందించారు.

69th Hyundai Filmfare Awards 2024: 69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. బ్లాక్ లేడీని అందుకున్న సినిమాలు ఇవే
Filmfare Awards 2024
Follow us
Rajeev Rayala

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 28, 2024 | 10:35 AM

69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 వేడుకను గుజరాత్ టూరిజంతో కలిసి జనవరి 27, 2024న గాంధీనగర్‌ ఘనంగా నిర్వహించింది. గత ఏడాది ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్‌లో తమ లుక్స్ తో మెస్మరైజ్ చేశారు. 2023లో విడుదలైన హిందీ చిత్రాలకు ఈ అవార్డులు లభించాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ విజేతలకు ప్రతిష్టాత్మక బ్లాక్ లేడీని అందించారు. అంతే కాదు అందాల తార జాన్వీ కపూర్ ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. మొదటి రోజు కొన్ని క్యాటగిరీలకు సంబందించిన అవార్డులను ప్రకటించారు.

మొదటి రోజు కరిష్మా తన్నా,  అపర్శక్తి ఖురానా హోస్ట్ చేసిన కర్టెన్ రైజర్ అనేక హైలైట్‌లతో సందడిగా జరిగింది. అలాగే 2వ రోజు – గుజరాత్ టూరిజంతో 69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 అవార్డుల ప్రదానోత్సవం గుర్తుండిపోయేలా నిర్వహించనున్నారు. రెండో రోజు (జనవరి 28)న జరగనున్న ఈవెంట్ కు కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా, మనీష్ పాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తారు. బాలీవుడ్ స్టార్స్ రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులివ్వనున్నారు.

69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 విజేతలుగా నిలిచిన వారు వీరే..

1. ఉత్తమ యాక్షన్  -స్పిరో రజాటోస్, ANL అరసు, క్రేగ్ మాక్రే, యానిక్ బెన్, కెచా ఖమ్‌ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)

2. బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)

3. ఉత్తమ సినిమాటోగ్రఫీ -అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అస్ )

4. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ -సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)

5. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ -సచిన్ లవ్‌లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)

6. ఉత్తమ సౌండ్ డిజైన్ -కునాల్ శర్మ (MPSE) (సామ్ బహదూర్) అలాగే  సింక్ సినిమా (యానిమల్)

7. ఉత్తమ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్ కోహ్లి, విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)

8. ఉత్తమ VFX- రెడ్ చిల్లీస్ VFX (జవాన్)

9. ఉత్తమ కొరియోగ్రఫీ -గణేష్ ఆచార్య (వాట్ ఝుమ్కా.. సాంగ్ – రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)

నేడు ( జనవరి 28న) GIFTలో నిర్వహించనున్న 69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 గ్రాండ్ నైట్‌ జరగనుంది. సింగర్ పార్థివ్ గోహిల్ పవర్ ప్యాక్డ్ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో షో అత్యంత ఘనంగా ముగుస్తుంది.

ఫిలిం ఫేర్ అవార్డు ట్విట్టర్ పోస్ట్..

ఫిలిం ఫేర్ అవార్డు ట్విట్టర్ పోస్ట్..

ఫిలిం ఫేర్ అవార్డు ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.