Warangal: శ్రీనివాస్ మృతికి అదే కారణం.. వివరణ ఇచ్చిన వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌..

Warangal MGM Hospital: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Warangal: శ్రీనివాస్ మృతికి అదే కారణం.. వివరణ ఇచ్చిన వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌..
Mgm
Follow us
Basha Shek

|

Updated on: Apr 02, 2022 | 11:11 AM

Warangal MGM Hospital: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరుక్కుతిన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం ఆయనను వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీనివాస్‌ మృతిచెందినట్లు నిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనను సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం వరంగల ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు డాక్టర్ల పైనా కఠిన చర్యలు తీసుకుంది. కాగా శ్రీనివాస్‌ మృతిపై వరంగల్‌ ఎంజీఎం సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. ఆయన ఎలుకలు కొరకడం వల్ల చనిపోలేదని, కార్డియాక్‌ అరెస్ట్‌తోనే చనిపోయారని తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో చేరకముందే అతని అవయవాలు దెబ్బతిన్నాయని, అందుకే కోలుకోలేక మృతిచెందాడని చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు.

కాగా హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే అక్కడ కూడా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శ్రీనివాస్ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇదిలా ఉండగానే గత నెల31వ తేదీన ఎలుకల దాడిలో శ్రీనివాస్ కు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయాడు. ఈ క్రమంలో శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు శ్రీనివాస్ ను ఎంజీఎం నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ వైద్యులు ఆయన్ను వైద్యులు రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ (ఆర్ఐసీ)లో ఉంచి మెరుగైన చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

Also Read:Sikalahasti: శ్రీకాళహస్తి లో క్షుద్ర పూజలు.. అర్ధరాత్రి వేళల్లో తాంత్రిక మంత్రాలు

IPL 2022: రెండేళ్లలో కేవలం రెండు మ్యాచ్‌లు..మెగా వేలంలోనూ నిరాశే.. ఇప్పుడు మాత్రం రికార్డుల వేటలో..

Pranay Murder case: ప్రణయ్ హత్య కేసు నిందితుడు అబ్దుల్ బారీకి గుండెపోటు.. నిమ్స్ ఆస్పత్రికి తరలింపు