Sikalahasti: శ్రీకాళహస్తి లో క్షుద్ర పూజలు.. అర్ధరాత్రి వేళల్లో తాంత్రిక మంత్రాలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి(Srikalahasti) లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు...
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తి(Srikalahasti) లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శక్తి ఆలయం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ప్రత్యేక పూజలు(Black Magic) నిర్వహించారు. గుప్త నిధుల లభ్యమవుతాయని, శత్రువులకు హాని చేయవచ్చనే మూఢ నమ్మకాలతో ఒళ్లు గగుర్పొడిచే పూజలు నిర్వహిస్తుంచారు. గుప్త నిధుల కోసం తమిళనాడుకు(Tamilanadu) చెందిన ఐదుగురు మంత్రగాళ్ల ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్థరాత్రి సమయంలో తాంత్రిక పూజలు చేశారు. తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ప్రకాశ్ అప్పుల పాలయ్యాడు. తొట్టంబేడు పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్ లో తనకున్న స్థలం సమీపంల అతని స్నేహితులు కుమార్, ఓం ప్రకాష్ లతో కలిసి క్షుద్రపూజలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, తాంత్రక పూజలను భగ్నం చేశారు. ఎనిమిది మందిని తొట్టంబేడు పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఉన్న భైరవ కోన, వెయ్యిలింగాల కోన పరిధిలో తరచూ క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. జనసంచారం పెద్దగా ఉండకపోవడంతో కొందరు ఈ ప్రదేశాన్ని క్షుద్ర పూజలకు నిలయంగా మార్చుకున్నారు. అమావాస్య కావడంతో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో అనధికారికంగా పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వరస ఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Also Read
Seedless Mango: మార్కెట్‌లో సందడి చేస్తున్న టెంక లేని మామిడి పండు.. వీడియో వైరల్
Skin Care Tips: వేసవి కాలంలో మెరిసిపోయే అందం మీ సొంతం కావాలంటే.. ఇంట్లోనే ఇలా చేయండి..