AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అటవీశాఖ మంత్రి వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు.. వాటి ఖర్చేంతో తెలుసా..?

హనుమకొండ జూ పార్క్‌లోని వన్యప్రాణులను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దత్తత తీసుకున్నారు. మూగజీవుల సంరక్షణకు ప్రజలను ఆమె పిలుపునిచ్చారు. వ్యక్తులు, సంస్థలు తమ శక్తి మేరకు జంతువులను దత్తత తీసుకోవచ్చునని తెలిపారు. మంత్రి నాలుగు జంతువులను దత్తత తీసుకొని, వాటి సంరక్షణకు రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమం

ఆ అటవీశాఖ మంత్రి వన్య ప్రాణులను దత్తత తీసుకున్నారు.. వాటి ఖర్చేంతో తెలుసా..?
Adopt Wildlife
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 28, 2025 | 9:29 PM

Share

జంతు సంరక్షణ కేంద్రాల్లోని వన్యప్రాణులను ప్రతిఒక్కరూ దత్తత తీసుకోవాలి… మూగ జీవుల సంరక్షణలో బాధ్యతగా.వ్యవహరించాలని పిలునిచ్చిన అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తన వంతు బాధ్యత నిర్వహించారు.. హనుమకొండ జూ పార్క్ లోని రెండు వన్యప్రాణులను దత్తత తీసుకున్నారు… వాటి సంరక్షణ వ్యయం పూర్తిగా తానే బారిస్తున్నట్లు ప్రకటించి జూ పార్క్ సిబ్బందికి చెల్లించారు. హనుమకొండ లోని కాకతీయ జూవలాజికల్ పార్క్ లోకి ఈ మధ్యకాలంలోనే రెండు బెంగాల్ టైగర్స్ ను తీసుకొచ్చారు.. జంతు ప్రేమికులు సందర్శనార్థం పులుల ఇన్క్లోజర్స్ ను మంత్రి కొండా సురేఖ తో పాటు, స్తానిక MLA నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వన్య ప్రాణులను దత్తత తీసుకోని మూగజీవుల పోషణలో పాలు పంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తన వంతు బాధ్యతగా నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా, అడవి దున్నలను మొత్తం నాలుగు మూగ జీవులను దత్తత తీసుకున్నారు.. వన్యప్రాణుల దత్తత ప్రక్రియను పూర్తిచేసిన మంత్రి సురేఖ.. సంవత్సర కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం రూ. 50 వేల చొప్పున మొత్తం నాలుగు వన్యప్రాణులకు కలిపి రూ. 2 లక్షలను చెల్లించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, జూలో వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తులు, సంస్థలు, సంఘాలు వారి వారి సామర్థ్యాన్ని బట్టి చిన్న చిన్న పక్షులు, తాబేళ్ళు మొదలు పులుల వరకు మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం చొప్పున దత్తత తీసుకుని, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చిన మంత్రి సురేఖ తెలిపారు.. జంతు ప్రేమికులు అటవీ అధికారులను సంప్రదించి వన్యప్రాణుల దత్తతకు సంబంధించిన మార్గ దర్శకాలను అనుసరించి, వారి వారి ఇష్టానుసారం జంతువులను దత్తత తీసుకునే వెసులుబాటును అటవీశాఖ కల్పిస్తున్నదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..