Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెడ్ అలర్ట్..! పలు మండలాల్లో రికార్డ్ స్థాయిలో వర్షాలు..
Warangal District: గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వానలు
Warangal District: గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. పొంగిన వాగులు, చెరువులతో జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుండపోత వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతి నిధులు, పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికుడ మండలంలో 38 సెం.మీ వర్షపాతం నమోదైంది. ప్రజలను అప్రమత్తంచేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని జిల్లా అధికార యంత్రంగానికి సూచనలు చేసింది. వాగులు,చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తలు పాటించాలంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. వరంగల్ & హనుమకొండ కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ 915452937, 1800 425 3424. హనుమకొండ లో 1800 425 1115 టోల్ ఫ్రీ నెంబర్లు
అత్యధికంగా నడికుడలో 14.5, సంగెంలో 14.4 సెం.మీ, బయ్యారంలో 12.3, చింతగట్టులో 10.8, ఎల్కతుర్తిలో 10, ధర్మసాగర్‌లో 10.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. 28 కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. దీంతో కొందరు ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లోని బంధువుల వద్దకు వెళ్లిపోతున్నారు. మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం కనువిందు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీమునిపాద జలపాతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది.