Mirchi price: పండింది మిర్చి కాదు.. బంగారం.. క్వింటా ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకాయి.

Mirchi price: పండింది మిర్చి కాదు.. బంగారం.. క్వింటా ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
Red Mirchi
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 04, 2022 | 3:04 PM

Telangana: ఎర్ర బంగారం(Mirchi) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎర్ర బంగారం మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌(Enumamula market)లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. నిన్నటి వరకు రూ.25 నుంచి రూ.28 వేలకు పరిమితమైన మిర్చి ధర… ఒక్కసారిగా రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఏకంగా క్వింటా రూ.32వేలు పలికి… రికార్డు క్రియేట్ చేసింది. దేశీ రకం మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్ కు 32 వేల రూపాయల ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఇంతటి గరిష్ఠ ధర నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్ వ్యాపారులు చెబుతుతున్నారు.  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్‌ మండలం కర్కెపల్లికి చెందిన భిక్షపతి 10 బస్తాలు తీసుకురాగా… కాకతీయ ఆడ్తి వ్యాపారి ద్వారా లక్ష్మీసాయి ట్రేడర్స్‌ ఖరీదుదారు రూ.32 వేల చొప్పున కొనుగోలు చేశారు. ఆ రైతును ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మీ సన్మానించారు. ఊహించని విధంగా తాను పంచించిన మిర్చికి ధర లభించడం పట్ల రైతు ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్ని తాకాయి. మిర్చి ధరలు బహిరంగ మార్కెట్​లో రికార్డులు నమోదు చేసినప్పటికీ ఎక్కువ దిగుబడి లేకపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో ఎర్ర బంగారం విక్రయించేందుకు రైతులు వస్తూ ఉంటారు. రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు.

Also Read: శివుని చెంత జాగారంలో జనం.. ఊర్లో నుంచి శబ్ధాలు.. పరుగు పరుగున వెళ్లి చూడగా..

టక్కులాడి.. కి’లేడీ’.. ఏం చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..