AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GWMC: వరంగల్ పురపోరులో టికెట్ల లొల్లి.. సెల్ టవర్ ఎక్కి ఒకరు, బిల్డింగ్ ఎక్కి మరొకరు ఆత్మహత్యయత్నం

గ్రేటర్ వరంగల్ అధికార పార్టీలో టిక్కెట్ల కేటాయింపులు వివాదాస్పదంగా మారాయి.. పలువురు ఆశావహులు ఆత్మహత్యలకు యత్నించి హల్ చల్ చేశారు..

GWMC: వరంగల్ పురపోరులో టికెట్ల లొల్లి.. సెల్ టవర్ ఎక్కి ఒకరు, బిల్డింగ్ ఎక్కి మరొకరు ఆత్మహత్యయత్నం
Balaraju Goud
| Edited By: |

Updated on: Apr 22, 2021 | 10:40 PM

Share

Warangal Corporation Elections: గ్రేటర్ వరంగల్ అధికార పార్టీలో టిక్కెట్ల కేటాయింపులు వివాదాస్పదంగా మారాయి.. పలువురు ఆశావహులు ఆత్మహత్యలకు యత్నించి హల్ చల్ చేశారు.. ఆది నుండి పార్టీ జెండాలు మోసి, పార్టీ కోసం జీవితాలు దారపోసిన తమకు అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. మరోవైపు, ఫైయ్మెన్ కమిటీ పర్యవేక్షణ లో నిష్పక్షపాతంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించామని జిల్లా మంత్రులు చెబుతున్నారు.

వరంగల్‌ నగర పాలకసంస్థ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో టికెట్లు దక్కని ఆశావహులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కార్పొరేటర్ టికెట్ తమకే వస్తుందని ముందస్తుగా డివిజన్లలో సుడిగాలి పర్యటన చేయడంతో ఎన్నికల జోరు మరింత ఊపు పెంచారు. గత నెల రోజులుగా ఆశావహులు డివిజన్‌లలో మందు, విందు పార్టీలు ఇస్తూ ముందస్తు ప్రచారానికి తెరలేపారు. కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ వారే కావడంతో ఆశావహులంతా ఆ పార్టీ టికెట్‌ను ఆశిస్తుండటం విశేషం. ప్రతీ డివిజన్‌లలో పదుల సంఖ్యలో ఆశావహులుండగా వారంతా అధికార పార్టీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇతర పార్టీలో ఉన్నవారు సైతం ఇటీవల టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని పోటీపడుతుండటంతో పోటీ ఎక్కువైంది. దీంతో ఎన్నికల పోటీ కంటే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆశావహుల మధ్యనే పోటీ పెరిగింది.

అయితే, టికెట్లు దక్కని కొందరు సీనియర్ కార్యకర్తలకు గులాబీ ముళ్లు గుచ్చుకున్నట్లయింది. టిక్కెట్ల కేటాయింపులో భంగపాటు ఎదువడంతో ఆందోళనకు దిగారు.. కొందరు ఆత్మహత్యలకు యత్నించి హల్ చల్ చేశారు. ఇదే క్రమంలో 54వ డివిజన్ నుండి తన భార్య సునీతకు టిక్కెట్ ఆశించిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త రాచమల్ల రవీందర్ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు.. ఈనెల 19వ తేదీ ఉదయం తన సెల్ ఫోన్ ఇంట్లో భార్యకు అప్పచెప్పి.. తన భార్య- పిల్లలకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇంట్లో నుండి వెళ్లిపోయారు రాచమల్ల రవీందర్. ఇప్పటివరకు అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పటికీ అతని ఆచూకీ మాత్రం తెలియకుండాపోయింది. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.. తన భార్యకు టిక్కెట్ రాలేదని మనస్తాపంతో రవీందర్ ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, 58వ డివిజన్ నుండి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన శోభారాణి హల్ చేసింది.. అదాలత్ సెంటర్ లోని ఓ ప్రయివేటు బిల్లింగ్ పైకి పెట్రోల్ బాటిల్‌తో శోభారాణి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేసింది.. దాదాపు ఐదు గంటల పాటు సాగిన హైడ్రామా అనంతరం సీనియర్ నేతలు ఇరుపొరుగు వారు శోభారాణికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించి దిగివచ్చారు. టీఆర్ఎస్ పార్టీకోసం తన కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం తిరిగిన తనకు టికెట్ ఇవ్వకుండా…స్థానిక నేతలు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు.

ఇటు, 9వ డివిజన్ నుండి టిక్కెట్ ఆశించి బంగపడ్డ టీఆర్ఎస్ కార్యకర్త దర్శన్ సింగ్ ఆత్మహత్యకు యత్నించాడు. తనకు టిక్కెట్ కేటాయించ లేదనే మనస్తాపంతో అంబేద్కర్ సర్కిల్ వద్ద గల సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడి పనిచేసిన తనను కాదని వేరొకరికి టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో దర్శన్ సింగ్ కుటుంబ సభ్యులు బోరున విలపించారు.. మరోవైపు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దర్శన్ సింగ్ సెల్ టవర్ దిగి కిందకు వచ్చారు.

ఇదిలావుంటే, పని చేసే కార్యకర్తలందరికీ సమన్యాయం చేశామని, ఆశావాహుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జిల్లా మంత్రులు స్పష్టం చేశారు. 66 డివిజన్లలో సర్వేలు నిర్వహించి.. ఫైయ్‌మెన్ కమిటీ పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా టిక్కెట్ల కేటాయింపులు జరిగాయన్నారు. సర్వే రిపోర్టుల ఆధారంగా గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించామని బ్లాక్ మైల్ చేస్తే సహించేదన్నారు. పార్టీ ధిక్కరణ చర్యలు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోక తప్పదని జిల్లా మంత్రలు హెచ్చరించారు..

Read Also…  బీజేపీనేతల మధ్య చిచ్చు రాజేసిన లింగోజీగూడ డివిజన్‌ బైపోల్‌.. కేటీఆర్‌ను కలిసిన వారిపై బండి సంజయ్ గుర్రు