AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Printing fake currency : సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ.. వరంగల్‌లో నకిలీ నోట్లు ముద్రిస్తూ చిక్కిన దంపతులు

కంఫ్యూటర్, స్కానర్, కలర్ ప్రింటర్ సాయంతో మూడు నెలలుగా అన్ని డినామినేషన్ల నోట్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు...

Printing fake currency : సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఆశ.. వరంగల్‌లో నకిలీ నోట్లు ముద్రిస్తూ చిక్కిన దంపతులు
Fake Currency
Venkata Narayana
|

Updated on: Jun 03, 2021 | 11:52 AM

Share

Fake currency : వ్యాపారంలో నష్టపోయిన దంపతులు వాటి నుంచి బయపడేమార్గంగా దొంగనోట్ల ముద్రణను ఎంచుకున్నారు. కంఫ్యూటర్, స్కానర్, కలర్ ప్రింటర్ సాయంతో మూడు నెలలుగా అన్ని డినామినేషన్ల నోట్లను ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. అనంతరం వాటిని స్థానిక దుకాణాల్లో చలామణి చేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నించారు. వివరాల్లోకి వెళితే, వరంగల్‌ కాశిబుగ్గలోని తిలక్‌రోడ్డు ప్రాంతానికి చెందిన వంగరి రమేశ్ (55), సరస్వతి (45) భార్యాభర్తలు. రమేశ్ చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా, సరస్వతి ఫ్యాన్సీ దుకాణం, మ్యారేజ్ బ్యూరో నడిపేవారు.

అయితే, ఆర్థికంగా నష్టాలు రావడంతో వాటినుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల ముద్రణను ఎంచుకున్నారు. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల ముద్రణ గురించి తెలుసుకున్నారు. అనంతరం కంఫ్యూటర్, స్కానర్, ప్రింటర్, కరెన్సీ ముద్రణ కోసం బాండ్ పేపర్లు కొనుగోలు చేసి ముద్రణ ప్రారంభించారు. నగరంలో నకిలీ నోట్ల చలామణి పెరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెంచారు.

పక్కా సమాచారంతో రమేశ్ ఇంటిపై దాడి చేసి దొంగ నోట్ల ముద్రణ, చెలామణి చేస్తోన్న బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి మొత్తం రూ. 10, 09, 960 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దంపతులిద్దరితోపాటు మొత్తం నలుగుర్ని అరెస్ట్ చేశామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి మీడియా సమావేశంలో వెల్లడించారు.

Fake Currency 2

Fake Currency 2

Read also : Beggar murder : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ.. ఒకరు మ‌ృతి