TSPSC Exams: కరోనా ఎఫెక్ట్.. టీఎస్‌పీఎస్‌సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు వాయిదా..
TSPSC departmental exams postponed: దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మహమ్మారి కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా
TSPSC departmental exams postponed: దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం మహమ్మారి కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసుల సంఖ్య భారీగా పెరగుతోంది. ఈ తరుణంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. డిపార్ట్‌మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ బుధవారం వెల్లడించింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) డిపార్ట్‌మెంటల్ పరీక్షల మే 2021 సెషన్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించింది.
కాగా.. డిపార్ట్‌మెంటల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారకి వెబ్‌సైట్ www.tspsc.gov.in ని సందర్శించాలని సూచించింది. పరీక్షలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్‌ను దానిలో ఉంచుతామని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు తెలిపారు.
Also Read: