Beggar murder : హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ.. ఒకరు మృతి
రాజధాని హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది..
Clashes between two beggars One Died : రాజధాని హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఇద్దరు యాచకుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఏకంగా ఒకరి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఒక యాచకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా, పబ్లిక్ నల్ల (వాటర్ ట్యాప్) వద్ద స్నానం చేయకూడదని చెప్పిన కారణంగా యాచక వృత్తిగా జీవనం సాగించే పురుషోత్తం అనే వ్యక్తిని బహదూర్ అనే మరో యాచకుడు రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ గొడవ మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.