Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife kills Husband: తాగిన మైకంలో భర్తను హత్య చేసి భార్య..! ఎందుకో తెలుసా…!

Wife kills Husband: ఏడడుగులు నడిచినప్పటి నుంచి భర్తే దైవంగా భావించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్త పెట్టే బాధలు పంటికిందే దాచుకుంది. తన కష్టాలను తలరాతగా భావించింది. ఇలా భర్తలోని శాడిజం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో

Wife kills Husband: తాగిన మైకంలో భర్తను హత్య చేసి భార్య..! ఎందుకో తెలుసా...!
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 03, 2021 | 10:49 AM

ప్రపంచం మొత్తం కోవిడ్ భయంతో వణికిపోతుంటే… లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు మాత్రం భర్తల నుంచి తిప్పలు తప్పడంలేదు. ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులే సాక్ష్యం. మహిళలు ఇళ్ళలో ఊహించని విధంగా లాక్ డౌన్ ప్రభావంతో గృహ హింస అనుభవిస్తున్నారు . ఇక పోలీస్ స్టేషన్ల పరిధిలో లాక్ డౌన్ విధించిన నాటి నుండి ఇప్పటి వరకు గృహహింస కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు .

ఇలాంటి భర్త పెట్టే టార్చర్ భరించలేక ఓ భార్య తెగించేసింది. ఏడడుగులు నడిచినప్పటి నుంచి భర్తే దైవంగా భావించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్త పెట్టే బాధలు పంటికిందే దాచుకుంది. తన కష్టాలను తలరాతగా భావించింది. ఇలా భర్తలోని శాడిజం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో చేసేది లేక సబలగా మారింది. ఆవేశంలో భర్తపై దాడి చేసింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీపాద కాలనీలో ఈ రక్తపాతం జరిగింది. గత కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య మనస్పర్థాలతో వివాదం రాజుకుంటోంది.

అయితే.. భర్త పెట్టే టార్చర్ భరించలేక బుధవారం రాత్రి పీకల్లోతుగా తాగిన భార్య భర్తపై కోపంతో ఊగిపోయింది. తాగిన మైకంలో ఇంటికి వచ్చి భర్తతో ఘర్షణకు దిగింది. అప్పటికే ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో భార్య సహనం కోల్పోయి భర్తను గొడ్డలితో హతమార్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Vijay Devarakonda: చరిత్ర సృష్టించిన క్రేజీ హీరో.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ

Nivetha Thomas: వ‌కీల్‌సాబ్ త‌ర్వాత మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన నివేథా థామ‌స్‌.. ఈ సారి మ‌రో టాప్ హీరోతో..