AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Devarakonda: చరిత్ర సృష్టించిన క్రేజీ హీరో.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఈ పేరుకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన ఈ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్..

Vijay Devarakonda: చరిత్ర సృష్టించిన క్రేజీ హీరో.. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా విజయ్ దేవరకొండ
Vijay Devarakonda New Busin
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2021 | 6:10 AM

Share

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈ పేరుకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన ఈ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ టైమ్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించే 30 మంది ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020’ జాబితాలో టాప్ ప్లేస్ లో  నిలిచాడు విజయ్ దేవరకొండ. వరుసగా మూడోసారి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు.

ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మరే ఇతర హీరో కూడా సాధించలేకపోయిన ఘనతను యువ హీరో అందుకోవడం విశేషం. హైదరాబాద్ టైమ్స్ హిస్టరీలో హ్యాట్రిక్ టైటిల్ సాధించిన విజయ్ దేవరకొండ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు. హిస్టరీ అనే పదం నచ్చిందని.. ఫన్ గా కూడా ఉందని అన్నాడు. ఇంకా మరిన్ని టైటిల్స్ అందుకొని ఎవరికైనా ఈ రికార్డును బీట్ చేయడం చాలా కష్టం అనిపించే రేంజ్ లో ఉండాలని.. చాలా కాలం పాటు ఆ రికార్డ్ అలానే ఉండిపోవాలని అని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్  నటిస్తున్న లైగర్ సినిమా  మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు విజయ్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Most Desirable Man And Women In Tv 2020: మోస్ట్ డిజైరబుల్ 2020 టీవీ నటీనటులు ఎవరో తెలుసా..

Ram Pothineni : 14 ఏళ్ల వయసులోనే…. ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సాధించిన రామ్.. అదేంటో తెలుసా..

Shreya Ghoshal: మొదటిసారిగా కొడుకు ఫోటో షేర్ చేసిన సింగర్ శ్రేయా ఘోషల్ దంపతులు.. తనయుడి పేరు ఇంట్రడ్యూస్..