Nivetha Thomas: వ‌కీల్‌సాబ్ త‌ర్వాత మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన నివేథా థామ‌స్‌.. ఈ సారి మ‌రో టాప్ హీరోతో..

Nivetha Thomas: నాని హీరోగా తెర‌కెక్కిన జెంటిల్ మ‌న్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు అందాల తార నివేథా థామ‌స్‌. తొలి సినిమాలోనే అందంతో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుందీ చిన్న‌ది. ఇక అనంత‌రం...

Nivetha Thomas: వ‌కీల్‌సాబ్ త‌ర్వాత మ‌రో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన నివేథా థామ‌స్‌.. ఈ సారి మ‌రో టాప్ హీరోతో..
Nivetha New Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2021 | 9:56 AM

Nivetha Thomas: నాని హీరోగా తెర‌కెక్కిన జెంటిల్ మ‌న్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు అందాల తార నివేథా థామ‌స్‌. తొలి సినిమాలోనే అందంతో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుందీ చిన్న‌ది. ఇక అనంత‌రం వ‌చ్చిన నిన్నుకోరి, జై ల‌వ కుశ సినిమాల‌తో ఒక్క‌సారిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత పెద్ద‌గా భారీ ప్రాజెక్టుల్లో న‌టించ‌ని నివేథా.. తాజాగా వి సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి ఎక్కారు.

Nivetha In Mahesh Movie

Nivetha In Mahesh Movie

ఇక ఇటీవ‌ల ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాతో మ‌ళ్లీ ఒక్క‌సారిగా తెర‌పైకి వ‌చ్చారు నివేథా. ఈ సినిమాలో లీడ్ రోల్‌లో న‌టించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ప‌వ‌న్‌కు ఉన్న క్రేజ్ ఈ అమ్మ‌డుకి బాగానే క‌లిసొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. తాజాగా నివేథా మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను సంపాదించుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాలో నివేథా న‌టించే ల‌క్కీ ఛాన్స్‌ను కొట్టేసిన‌ట్లు స‌మాచారం. అయితే త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఒక టాప్ హీరోయిన్‌తో పాటు మ‌రో హీరోయిన్‌ను తీసుకుంటారు. ఆయ‌న గ‌త సినిమాలు చూస్తే ఇదే అర్థ‌మ‌వుతోంది. దీంతో ఈ సినిమాలో నివేథా లీడ్ రోల్‌లో న‌టిస్తుందా.? లేదా ప్రాముఖ్య‌త ఉన్న మ‌రో రోల్‌లో న‌టిస్తుందా చూడాలి. ఇంత‌కీ ఈ వార్త‌లో నిజం ఉందో లేదో కూడా తెలియాలంటే అధికారికి ప్ర‌క‌టన వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Radhe Shyam Movie : రాధేశ్యామ్ ఓటీటీ బాట పట్టనుందా..? ఫిలింసర్కిల్ లో చక్కర్లు కొడుతున్న వార్త ..

Ram Pothineni: ఆచితూచి అడుగులేస్తున్న ఎనర్జిటిక్ హీరో.. కెరీర్ లో ఫస్ట్ టైం అలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్న రామ్

NTR 31: మునుపెన్నడూ చేయని పాత్రలో యంగ్ టైగర్.. ప్రశాంత్ నీల్ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న తారక్