MLA Sitakka : డీసీపీ రక్షిత తీరుపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన.. తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్య జనం మాటేమిటని ఆగ్రహం
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒక పోలీస్ ఉన్నతాధికారి మీద తన అసంతృప్తిని..
Mulugu MLA Sitakka : ములుగు ఎమ్మెల్యే సీతక్క ఒక పోలీస్ ఉన్నతాధికారి మీద తన అసంతృప్తిని వీడియో కాల్ రూపంలో వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలు అనారోగ్యం సహా అనేక కారణాలతో తీవ్ర ఇబ్బందుల పాలవుతుంటే, కొందరు పోలీసులు తమ ఇష్టానికి వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు తన కుటుంబసభ్యులు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లని రోడ్డుపై అడ్డుకుని అరగంటకు పైగా రక్షిత అనే డీసీపీ నిలిపివేశారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వీడయో కాల్ లో సీతక్క ఏమన్నారంటే.. “మా అమ్మ ఐసీయూలో సీరియస్ గా ఉంటే, ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్న మా కుటుంబ సభ్యులను ఈ విధంగా మల్కాజిగిరి డీసీపీ రక్షిత గారు వాళ్లని అడ్డుకొని దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టి నేను వీడియో కాల్ చేసిన మాట్లాడే ప్రయత్నం చేయలేదు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ మా వాళ్లని అన్నారు. ఒక సేవకురాలు ఎమ్మెల్యే అయినా నాకు ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి..”
అంటూ ఆమె తన వీడియో కాల్ లో ప్రజల ఇబ్బందుల్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సదరు సీతక్క వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.