Covid Miss information: ఆన్‌లైన్ కరోనా డ్రగ్స్ విషయంలో మోసపోయారా..? ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేయండి..
Covid Miss information: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఓ వైపు మనుషుల ఆరోగ్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థలను పతనం చేస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ప్రజలు...

Covid Miss information: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఓ వైపు మనుషుల ఆరోగ్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థలను పతనం చేస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంటే ఇదే అదునుగా భావించి కొందరు మోసగాళ్లు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొవిడ్ డ్రగ్స్ అమ్మకానికి పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ మోసాలు మరీ ఎక్కువయ్యాయి. బ్లాక్ మార్కెట్లో కొవిడ్ పేరుతో జరుగుతోన్న అక్రమ డ్రగ్స్ అమ్మకాల ద్వారా మోసపోతున్న కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే చాలా మంది సరైన అవగాహన లేక ఫిర్యాదు చేయడానికి ముందుకురావడం లేదు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన సైబర్ జాగృతి అనే ఎన్‌జీవో ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్‌జీవో కేవలం ఒక్క నెలలోనే 25కి పైగా ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులను గుర్తించారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ మోసాల బారిన పడిన వారి కోసం కొవిడ్ హెల్ప్ లైన్ నెంబర్‌ను అందించారు. బాధితులు.. 8367374231 లేదా 04067419503 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రకటనలు ఏమైనా ఉంటే.. వాటిని క్రాస్ చెక్ చేసి సమాచారాన్ని అందిస్తామని, వైద్య సంబంధిత సలహాలు, సూచనలు ఇవ్వడానికి తమ వద్ద ఒక వైద్య బృదం ఉందని ఎన్‌జీవో వ్వవస్థాపకులు రూపేశ్ మిట్టల్ చెప్పుకొచ్చారు.
Also Read: Corona Cases India: దేశంలో కొత్తగా మరో 1.34 లక్షల పాజిటివ్ కేసులు, 2887 మరణాలు..
