AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anandayya Eye Drops: అనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. ఐ డ్రాప్స్ ఇప్పట్లో ఉండదని నివేదించిన ఏపీ సర్కార్

కృష్ణప‌ట్నం ఆనంద‌య్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీకి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కంటిలో వేసే చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది.

Anandayya Eye Drops: అనందయ్య మందుపై కొనసాగుతున్న విచారణ.. ఐ డ్రాప్స్ ఇప్పట్లో ఉండదని నివేదించిన ఏపీ సర్కార్
Ap High Court
Balaraju Goud
|

Updated on: Jun 03, 2021 | 2:47 PM

Share

Hhigh Court Trails Anandayya Mandu:నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీకి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కంటిలో వేసే చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఆనంద‌య్య చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందింద‌ని ప్రభుత్వం హైకోర్టుకు వివ‌రించింది. కాగా, చుక్కల మందు వ‌ల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండ‌వ‌ని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్‌, నిల్వకు నెల నుంచి మూడు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందువ‌ల్ల మూడు నెల‌ల తర్వాత పంపిణీ చేసే అవ‌కాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. లంచ్ విరామం నేప‌థ్యంలో హైకోర్టు విచార‌ణ‌ను వాయిదా వేసింది. అనంత‌రం ఆనందయ్య, పిటిషనర్ల వాదనను హైకోర్టు ధర్మాసనం విననుంది.

ఆనందయ్య ఐ డ్రాప్స్‌కి అనుమతి ఇవ్వలేమంది ప్రభుత్వం. ఐ డ్రాప్స్‌కి చేసిన పరీక్షల్లో స్టేరిలిటీ టెస్టులో ఇబ్బంది ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే కంటికి సంబంధించిన విషయం కాబట్టే ఇప్పుడే అనుమతి ఇవ్వలేమని…దీనిపై డిటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అనుమతిస్తామంది. ఇందుకు మూడు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. నివేదిక రాకుండా ఐ డ్రాప్స్ వేయడానికి రికమండ్ చేయలేని స్పష్టం చేసింది ప్రభుత్వం. లంచ్‌ బ్రేక్ తర్వాత ఐ డ్రాప్స్‌కి పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది.

ఇదిలావుంటే, ఐ డ్రాప్స్ మినహా మిగతా మందుల పంపిణీకి సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే, ఐ డ్రాప్స్ పంపిణీ కూడా చేపట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మసనం ఇవాళ విచారణ చేపట్టింది. మొత్తం 4 పిటిషన్లపై విచారణ జరుపుతోంది. ఇక, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆనందయ్య మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాలు ఏవీ హానికరం కాదని నిర్దారించారు. కంటిలో వేసే మందు మినహా మిగిలిన మందులు రోగులకు అందివచ్చని షరతు విధించింది. దీంతో వాటి తయారీకి ఆనందయ్య సిద్ధం అవుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి కరోనా నివారణకు ఆనందయ్య ఇచ్చే మందులు అందుబాటులోకి రానున్నాయి.

Read Also…. Flight Attendants: విమానంలో ప్రయాణీకుల సహాయానికి ఎక్కువగా మహిళా సిబ్బందే ఎందుకు ఉంటారు? ప్రత్యేక కారణం ఉందా?