Covid Positive: ఉత్తరాఖండ్‌లో పోలీసులను వెంటాడుతున్న కరోనా.. 2300 మందికి పాజిటివ్‌.. 93శాతం వ్యాక్సినేషన్‌

Covid Positive: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. రోజురోజు ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్రాలు అనేక చర్యలు చేపడుతున్నాయి...

Covid Positive: ఉత్తరాఖండ్‌లో పోలీసులను వెంటాడుతున్న కరోనా.. 2300 మందికి పాజిటివ్‌.. 93శాతం వ్యాక్సినేషన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Jun 03, 2021 | 2:06 PM

Covid Positive: కరోనా మహమ్మారి చేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. రోజురోజు ఎంతో మంది ప్రాణాలను తీస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్రాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లో కూడా కరోనా మహమ్మారి తీవ్రంగానే ఉంది. ఆ రాష్ట్ర పోలీసు విభాగంలో మొత్తం 2,300 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో 751 మందికి కరోనా పాజిటివ్ రాగా, కరోనా వైరస్ కారణంగా ఐదుగురు జవాన్లు, వారి కుటుంబ సభ్యుల్లో 64 మంది ప్రాణాలు మరణించారు.

కరోనా కట్టడికి విధి నిర్వహణలో భాగంగా ఉన్న పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తరాఖండ్ పోలీసుల్లో 93 శాతం మందికి కోవిడ్‌ రెండు మోతాదుల వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్‌ పాజిటివ్ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక కరోనా రోగులకు ఆక్సిజన్, పడకలు, ప్లాస్మా అందించడానికి గత నెలలో ఉత్తరాఖండ్ పోలీసులు మిషన్ హౌస్లా అనే ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు.

ప్రజలకు రేషన్, అంబులెన్సులు అందించడం, మృతదేహాలను దహనం చేయడంలో పోలీసులు ప్రజలకు సహకరించారు. మిషన్ హౌస్లా ప్రాజెక్టు కింద ప్రజల నుంచి 31,815 ఫోన్ కాల్స్ రాగా, పోలీసులు 2,726 మందికి ఆక్సిజన్ సిలిండర్లు, 792 మంది ఆసుపత్రుల్లో పడకలు, 217 మందికి ప్లాస్మా, రక్తదానం చేశారు. ఉత్తరాఖండ్ పోలీసులు 17,609 మందికి మందులు తీసుకోవడానికి సహాయం చేశారు. రేషన్, పాలు, వండిన ఆహారాన్ని 94,484 మందికి అందించారు. 492 మంది కోవిడ్‌ మృతులకు దహన సంస్కారాలు సైతం చేశారు. మొదటి దశ కరోనా వేవ్ లో 1982 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని తేలగా 8 మంది మరణించారు. ఇలా తమ కుటుంబాలను పట్టించుకోకుండా ప్రజలకు ఎల్లవేళల సహకరిస్తున్న పోలీసులు ప్రాణాలు పోతున్నారు. ఒక వైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంటే..మరో వైపు కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల నుంచి దేశంలో పాజిటివ్‌ కేసులు, మరణాల తగ్గుఖం పట్టింది.

ఇవీ కూాడా చదవండి:

మహిళా ఎంపీకి పార్లమెంట్‌లో చేదు అనుభవం.. ప్యాంట్‌ ధరించి వచ్చినందుకు సభకు అనుమతించని స్పీకర్‌

Corona Cases India: దేశంలో కొత్తగా మరో 1.34 లక్షల పాజిటివ్ కేసులు, 2887 మరణాలు..

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా